ENGLISH | TELUGU  

పెళ్లిలో పెళ్లి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్.. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్  

on Aug 8, 2025

గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్  తమ ప్రొడక్షన్ నెం.1గా  "పెళ్లిలో పెళ్లి"(Pellilo Pelli)చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణుప్రియ, ఉమామహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు. గణేష్ కోలి(Ganesh KOli)నిర్మాత కాగా 'శ్రీకాంత్ సంబరం'(Srikanth Sambaram)దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి(Tanikella bharani) మాట్లాడుతు 'పెళ్లిలో పెళ్లి"లో సినిమా ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడు అనిపిస్తోంది. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త..అంటే సుఖాన్ని అందించేవాడు అని అర్థం. దర్శకుడు శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. షోలాపూర్ లో సినిమా చేస్తున్నామని చెప్పాడు. అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉంటారు. నన్ను ఈ టీమ్ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. పెద్దలను గౌరవించడం అనే గొప్ప గుణం వీళ్లందరిలో కనిపించింది. గణేష్ కోలి లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ కు సక్సెస్ వస్తే మరిన్ని మంచి చిత్రాలు యంగ్ స్టర్స్ తో నిర్మిస్తారు. ఆయన "పెళ్లిలో పెళ్లి" సినిమాతో హిట్ అందుకుని బాలీవుడ్ లో సినిమాలు చేసేంతగా ఎదగాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం ప్రతిభావంతుడు. హైదరాబాద్ లో సినిమా చేయడం సులువే కానీ షోలాపూర్ కు 24 క్రాఫ్టుల వాళ్లను తీసుకెళ్లి చాలా స్పీడ్ గా సినిమా రూపొందించాడు. అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా అని మాట్లాడారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ మూవీకి   మంచి కథ కథనాలతో పాటు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరాయి. ఇంత మంచి సినిమాకి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి థ్యాంక్స్. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తనికెళ్ల భరణి గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. నెక్ట్స్ రాబోయే ఈవెంట్స్ లో ఈ చిత్రం గురించి మరింతగా మాట్లాడుతా అన్నారు. హీరోయిన్ సంస్కృతి గోరే మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" సినిమా మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా పట్ల మేమంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మీ అందరినీ ఆకట్టుకునేలా "పెళ్లిలో పెళ్లి"  ఉంటుంది. మీ సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నా.ను అని మాట్లాడింది. 

నటి దివిజ మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారు లేకుంటే ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యేది కాదు. ఈ టీమ్ తో కలిసి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. త్వరలోనే మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం అన్నారు.

హీరో శివ సాయిరిషి మాట్లాడుతు 'మా మూవీ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. భరణి గారికి, ఆకాష్ జగన్నాథ్ అన్నకు థ్యాంక్స్. నన్ను ఈ వేదిక మీద చూసి మా అమ్మ సంతోషిస్తోంది. నేను ఈ సినిమా చేసేందుకు మా ప్రొడ్యూసర్ గణేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో సపోర్ట్ చేశారు. షోలాపూర్ నాకు మరో ఇల్లులా మారింది. ఈ టీమ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ఎంఎల్ రాజా గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. మా మూవీ గురించి నెక్ట్స్ ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతా, త్వరలోనే రిలీజ్ కు వస్తున్న మా "పెళ్లిలో పెళ్లి" సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.

ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతు'మేము మహారాష్ట్రలో ఉంటాం. కానీ తెలుగు సినిమాలు చూస్తుంటాం. తెలుగు భాషను అభిమానిస్తాం. తెలుగులో తెరకెక్కే కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టపడతాం. సినిమా మేకింగ్ మీద అభిరుచితో "పెళ్లిలో పెళ్లి" చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నాను. ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలి, గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతు మా ఈవెంట్ కి  పిలవగానే వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్స్. ఆయనను ఇన్వైట్ చేసేప్పుడు నేను దేవుడిలా భావించే పూరి జగన్నాథ్ గారిని కలిశాను. షోలాపూర్ కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. నేను గణేష్ మండపం దగ్గర ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారిని కలిశాను. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది. భరణి గారు మా మూవీలో కీ రోల్ చేశారు. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. ఎంఎల్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ మా మూవీకి సోల్ లాంటిది. మాలాంటి కొత్త వాళ్లకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల్సింది మీరే. అన్నారు.

యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతు 'ఇది పోస్టర్ లాంఛ్ లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్ గా చేశారు. ఈ సినిమా టీమ్ చూస్తుంటే అంతా యంగ్ స్టర్స్ ఉన్నారు. ఇలాంటి యంగ్ టీమ్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి నా అభినందనలు. ఈ సినిమాలో కీ రోల్ చేసి ఈ టీమ్ కు సపోర్ట్ గా ఉన్న భరణి గారికి కూడా థ్యాంక్స్. "పెళ్లిలో పెళ్లి" సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ పుల్ గా ఇంప్రెస్ చేస్తోంది. సినిమా కూడా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.

 శివ సాయి,సంస్కృతి గోర్, దివిజ, తనికెళ్ల భరణి లతో పాటు విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్: వేణుగోపాల్ ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్ : కె.దత్తాత్రేయ, డీవోపీ : శుభం గుండ్ల, పీఆర్ఓ - సతీష్. కె, డిజిటల్: నరేష్, ఉదిత్ సాయి, శివ, కో ప్రొడ్యూసర్: రూపాలీ కొల్లి.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.