కాంతార మరో నటుడి మృతి.. వరుసగా ఎందుకు చనిపోతున్నారు
on Aug 8, 2025

'రిషబ్ శెట్టి'(Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార'(Kantara)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంతార' కి ఫ్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)ముస్తాబవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని రిషబ్ శెట్టి అత్యంత భారీ వ్యయంతో,ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి 'కాంతార' కి సంబంధం ఉన్న నటీనటులు వరుసగా మరణిస్తు వస్తున్నారు.
ఆ కోవలోనే రీసెంట్ గా 'కాంతార'లో మహాదేవ క్యారక్టర్ లో కనిపించిన 'టి ప్రభాకర్ కళ్యాణి'(T. Prabhakar Kalyani)గుండెపోటుతో తన నివాసంలో మృతి చెందాడు. తొలుత నాటక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాకర్, ఆ తర్వాత, సినిమాల్లోకి ప్రవేశించి అనేక చిత్రాల్లో నటించాడు. ఆయనకి భార్య, కుమారుడు ఉండగా, కొన్ని రోజుల క్రితం ప్రభాకర్ కి హార్ట్ ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది.కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడికా 'ప్రభాకర్' స్వస్థలం.
కాంతార చాప్టర్ 1 కి సంబంధించి మే నెలలో ముప్పై నాలుగు సంవత్సరాల 'రాకేష్ పూజారి'(Rakesh Poojary)గుండెపోటుతోనే మరణించాడు. ఇదే నెలలో పాతికేళ్ళు కూడా లేని జూనియర్ ఆర్టిస్ట్, కాంతారా షూటింగ్ ని ముగించుకొని ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న ఒక నదిలో ఈతకి దిగి చనిపోయాడు. జూన్ లో 'కళాభవన్ నిజూ'(Kalabhavan Niju)అనే మరో ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు.ఈ విధంగా కాంతార సిరీస్ లో నటించిన వాళ్ళందరు వరుసగా చనిపోతుండటం వైరల్ గా మారింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



