రాజేంద్రప్రసాద్ కూతురు మృతిపై పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్
on Oct 5, 2024
నాలుగున్నర దశాబ్డలపై నుంచి తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు రాజేంద్రప్రసాద్ కి తమ ప్రగాఢ సానుభూతుని తెలియచేస్తున్నారు.
రీసెంట్ గా ఈ విషయంపై ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్(pawan kalyan)ఒక నోట్ ని రిలీజ్ చేసారు. శ్రీమతి గాయత్రి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపాడు. తొలి నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్, పవన్ కళ్యాణ్ కి మధ్య అవినాభావ సంబంధం ఉంది.
Also Read