రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మృతిపై ఎన్టీఆర్ ట్వీట్
on Oct 5, 2024
నాలుగున్నర దశాబ్డలపై నుంచి తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)గారి కుమార్తె శ్రీమతి గాయత్రి (gayathri)హఠాన్మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు రాజేంద్రప్రసాద్ కి తమ ప్రగాఢ సానుభూతుని తెలియచేస్తున్నారు.
రీసెంట్ గా ఈ విషయంపై ప్రముఖ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి చాలా విషాదకరం.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతుని తెలియచేస్తున్నాని ట్వీట్ చేసాడు.ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్ కలిసి నాన్నను ప్రేమతో అనే సినిమాలో తండ్రి, కొడుకులుగా అత్యద్భుతంగా నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందారు.
Also Read