పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన..మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది
on Apr 8, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్నకొడుకు మార్క్ శంకర్(Mark Shankar)కి ఈ రోజు ఉదయం సింగపూర్ లోని తాను చదువుకుంటున్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరగడంతో కాళ్ళు చేతులకి గాయాలయ్యాయి.పెద్ద ఎత్తున పొగ కూడా కమ్ముకోవడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లి
అస్వస్థతకి గురవ్వడంతో హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తు బాబు ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు.ఇప్పటికే అన్నాలెజినోవా(Anna Lezhneva)సింగపూర్ చేరుకోగా పవన్ మరికాసేపట్లో సింగపూర్ చేరుకోనున్నాడు.ఈ ప్రమాదంలో 15 మంది పిల్లలు,4 గురు స్కూల్ సిబ్బంది గాయపడినట్టుగా తెలుస్తుంది.మార్క్ శంకర్ హెల్త్ విషయంలో ఎలాంటి భయాల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆరోగ్యం నిలకడగా ఉందనే వార్తలు వస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



