నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. షాకిచ్చిన బన్నీ-అట్లీ..!
on Apr 8, 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. సన్ పిక్చర్స్ అత్యధిక బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని.. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నేడు(ఏప్రిల్ 8న) అధికారికంగా ప్రకటించారు.
AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్ర ప్రకటన సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అల్లు అర్జున్, అట్లీ కలిసి యూఎస్ లోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోను సందర్శించారు. వీడియోని బట్టి చూస్తే.. ఈ సినిమా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అనే రేంజ్ లో ఉంది.
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో రానున్న ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ జానర్ ఇద్దరికీ ఫస్ట్ టైం కావడం విశేషం. పైగా ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
