పవన్ సర్దార్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
on Aug 1, 2015
గత కొంతకాలంగా రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు కెమెరా ముందుకొచ్చాడు. వచ్చి రాగానే తన దూకుడును చూపిస్తున్నాడు. సర్దార్ షూటింగ్ లో పాల్గొన్న వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మీడియాలో సర్దార్ హంగామా మొదలైంది. అలాగే ఈ సినిమాను ఆపకుండా చకచక పూర్తి చేయాలని యూనిట్ ని సూచి౦చాడట. ఈ సినిమాను సంక్రాంతి కంటే ముందే రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నాడట. మొత్తానికి పవన్ రాకతో సర్దార్ యూనిట్ లో పవర్ స్టార్ట్ అయ్యింది.