శివరాత్రికి తమ్ముడు.. పోస్టర్ అదిరింది!
on Nov 4, 2024
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'తమ్ముడు' (Thammudu). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు 'తమ్ముడు' సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
'తమ్ముడు' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగడా చేత పట్టిన నితిన్, భుజానికి పాపను ఎత్తుకుని పరుగెడుతూ రావడం, ఆయనతో పాటు ఊరి ప్రజలు కూడా కాగడాలతో వస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
'తమ్ముడు' చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి.. సినిమాటోగ్రాఫర్ గా కేవీ గుహన్, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి వ్యవహరిస్తున్నారు.
Also Read