మీకు అవసరముంటే రెండు కోట్లు ఇస్తానంటున్న హర్ష సాయి
on Nov 4, 2024
కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ మాజీ కంటెస్ట్, సినీనటి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(harsha sai)తన దగ్గర రెండు కోట్ల రూపాయిల డబ్బు తీసుకోవడంతో పాటుగా లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై హర్ష పై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన హర్ష కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసాడు.దీంతో కోర్టు హర్ష కి బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో హర్ష సాయి తొలి సారి మీడియాతో మాట్లాడుతు ఇన్ని రోజులు వేరే పని మీద బయట ఉండాల్సి వచ్చింది. రెండు కోట్లు రూపాయలని ఎవరకి పడితే వాళ్ళకి ఇవ్వను.అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను.డబ్బు కోసం ఎవరైనా సరే బ్లాక్ మెయిల్ చేస్తే భయపడాల్సిన పని లేదు.అందుకే నా మీద వచ్చిన ఆరోపణల మీద ఫైట్ చేశాను.నిజా నిజాలు అర్ధం చేసుకొని కోర్టు బెయిల్ ఇచ్చింది. ఫ్రీ గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే నా మీద కేసు వేసారు. ఒక సినిమా కథ విషయంలో మోసం చేసారని అనేది కూడా అబద్దమే. ఎందుకంటే ఆ కథ కూడా నాదే అని చెప్పుకొచ్చాడు.
Also Read