గాంధీకి ఛాన్స్ ఇచ్చిన నితిన్
on Feb 15, 2020
అవును... గాంధీకి నితిన్ ఛాన్స్ ఇచ్చాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అతడు ఓ సినిమా చేయనున్నాడు. అయితే... అది స్ట్రయిట్ సినిమా కాదు. ఒక రీమేక్. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా 'అంధాదున్'. తెలుగులో ఈ సినిమాను నితిన్ రీమేక్ చేయనున్నాడనేది తెలిసిన మాటే. ఈ రీమేక్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని మధ్యలో ప్రచారం జరిగింది. అటువంటిది ఏమీ లేదని నితిన్ తెలిపాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' రీమేక్ చేస్తున్నట్టు స్పష్టం చేశాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' ఈ నెల 21న విడుదల అవుతుంది. ఇది కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అని మరో సినిమా అంగీకరించాడు. ఇవన్నీ పూర్తయిన తర్వాత 'అంధాదున్' రీమేక్ స్టార్ట్ కానుంది.