నికిషాకు అంత సీనుందా?
on May 23, 2015
నా వెంట రావద్దు అంటే ఎత్తుకోమని మొత్తుకున్నట్టుంది పవన్ బ్యూటీ తీరు. నటన సరిగా నేర్చుకోమ్మా అంటే గజినీగా మెప్పిస్తా అని హడావుడి చేసేస్తోందట. పవన్ కళ్యాణ్ కొమరం పులితో హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టిన నికిషా పెద్దగా క్లిక్కవలేదు. పైగా ఫిగరు బాలేదనే కామెంట్స్ వచ్చాయి. కొన్నాళ్లుగా తెరపై కనిపించనేలేదు. అటు తమిళం, కన్నడంలో మాత్రం బండి నెమ్మదిగా నెట్టుకొస్తోంది. ప్రస్తుతం తమిళంలో ‘నారదన్’ అనే చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమాలో లేడీ గజినీగా కనిపించనుందట. ఈ తరహా పాత్రలో సూర్య, అమీర్ ఖాన్ నటన అద్భుతం అని తెలిసిందే. అలాంటిది నటనే సరిగ్గా రాని నికిషాకు ఇంత పెద్ద ప్రయోగం అవసరమా అని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడు మాత్రం నే చేస్తా అంతే అని పట్టుబట్టి కూర్చుంది. దీంతో 'పులి'పిల్లకి ఇప్పుడే పిచ్చిముదిరినట్టుందంటున్నారు. మరి ఉత్సాపడి వేస్తున్న గజినీ వేషం పాస్ మార్కులైనా దక్కించుకుంటుందా?