హాఫ్ అమౌంట్ వదులుకున్న నిఖిల్
on Nov 28, 2019
తమిళ హిట్ 'కణితన్' రీమేక్‌ను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశాడో గానీ... ఎప్పుడూ ఎదుర్కొని పరిస్థితులను, బ్యాడ్ టైమ్‌ను నిఖిల్ ఎదురు చూశారు. ముందు 'ముద్ర' టైటిల్‌తో ఈ సినిమా స్టార్ట్ అయింది. అదే టైటిల్ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేసుకున్నారు. అప్పుడు ఒక పంచాయతీ. ముందు ఆ సినిమా విడుదల కావడంతో టైటిల్ మార్చుకోక తప్పలేదు. తర్వాత 'అర్జున్ సురవరం'గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే, పరిస్థితులు అనుకూలించలేదు. వాయిదాలు పడుతూ పడుతూ ఎట్టకేలకు ఈ వారం విడుదలకు నోచుకుంది.
సినిమా విడుదల ఆలస్యం కావడం వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని నిఖిల్ తెలిపాడు. అన్నిటికంటే ముఖ్యంగా నిర్మాతకు హెల్ప్ కావాలనే ఉద్దేశంతో డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకున్నానని అతడు అన్నాడు. ముందు మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ లో హాఫ్ అమౌంట్ మాత్రమే నిఖిల్ కు ముట్టిందట. హాఫ్ అమౌంట్ (రెమ్యూనరేషన్) వదులుకున్నానని అతడు చెప్పాడు. ఈ సినిమా ఆలస్యం కావడంతో మిగతా సినిమాలపై దృష్టి పెట్టలేకపోయానన్నాడు. ఇప్పుడు మూడు కథలు ఓకే చేసి పెట్టుకున్నానని నిఖిల్ చెప్పాడు. "గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తాను., 'కార్తికేయ 2' డిసెంబర్ లో ప్రారంభిస్తా. మరో కథ 'హనుమాన్' అని ఒకటి ఉంది" అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పాడు.