మీ శరీరం ఏం కోరుకుంటుందో అది ఇవ్వండి: నీహారిక ప్రత్యేక శ్రద్ధ
on Aug 8, 2025

యాంకర్ గా,నటిగా, 'నీహారిక కొణిదెల'(NIharika Konidela)సినీ ప్రయాణం అందరకి తెలిసిందే. ఒక మనసు, సూర్య కాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి విభిన్న చిత్రాల్లో, వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషించి, మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. కొంత కాలంగా నటనకి దూరంగా ఉన్న నీహారిక, గత ఏడాది నిర్మాతగా మారి 'కమిటీ కుర్రోళ్ళు'(Committee Kurrollu)వంటి కామెడీ డ్రామాని తెరకెక్కించి, నిర్మాతగాను ఘన విజయాన్ని అందుకుంది.
సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే 'నీహారిక' రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్(Instagram)స్టోరీలో పీరియడ్స్ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో 'డియర్ లేడీస్ మహిళల శరీరం అద్భుతమైనది. మన బాడీస్ కి ఏం చేస్తున్నామో వాటికి తెలుసు. మనం చేయాల్సిందల్లా ప్రొటెక్ట్ చెయ్యడంతో పాటు హీల్ చెయ్యడం. నెలమొత్తం ఒకేలా ఉండటం. హయ్యస్ట్ హైస్, లోయస్ట్ లోస్ అనుభవించడం కూడా సహజం. కాబట్టి మీ బాడీ ఏది కోరుకుంటుందో అది ఇవ్వండని ఇనిస్టా స్టోరీ లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు సాటి ఆడ వారి ఆరోగ్యం గురించి మంచి సలహా ఇచ్చినందుకు పలువురు నీహారికని మెచ్చుకుంటు కామెంట్స్ చేస్తున్నారు. నీహారిక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం వాట్ ఏ ఫిష్ అనే మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాకపోతే గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి కొత్త అప్ డేట్ లేదు. నిర్మాతగా కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



