అగస్ట్ 15 న పదిహేను సినిమాలు విడుదల
on Aug 7, 2024
ఏ మాత్రం లేటు చెయ్యకుండా మీ ఫోన్ లో నోట్ పాడ్ ఓపెన్ చేసి నేను చెప్పబోయే సినిమాల లిస్ట్ రాసుకోండి.లిస్ట్ అంటున్నారు, ఎన్ని ఉన్నాయేంటి అని అంటారా. మిమల్ని కనువిందు చెయ్యడానికి భారీగానే వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజను కి పైగా సినిమాలు.
అగస్ట్ 15 న సినీ అభిమానులకి సరికొత్త స్వాతంత్య్రం రాబోతుంది. కాకపోతే ఇది సినీ స్వాతంత్య్రం. మాస్ మహారాజ రవితేజ, హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్(mister bachchan)రామ్ అండ్ పూరి డబుల్ ఇస్మార్ట్(double ismart)చియాన్ విక్రమ్ పా రంజిత్ ల తంగలాన్(thangalan)ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఆయ్(aay) లు తెలుగు నాట సందడి చేయనున్నాయి. ఇవే కాకుండా తమిళంలో మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)ప్రధాన పాత్రలో చేసిన రఘు తాత, ఎవడే సుబ్రహ్మణ్యం , కల్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయర్ లీడ్ రోల్ లో చేసిన క్రిష్ణమ్ ప్రణయ సఖి, హిందీ అందాడున్ రీమేక్ గాతెరకెక్కిన అందగాన్, డిమోంటి కాలనీ అంటూ తెలుగు ప్రేక్షకులని కూడా భయపెట్టిన హర్రర్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న డిమోంటి కాలనీ 2 , కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వన్ మాన్ షో బైరతి రనగల్, భావన హంట్ లతో పాటు మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ నున కుజి తో పాటు వాజా అనే మరో మలయాళ కామెడి మూవీ కూడా సిల్వర్ స్క్రీన్ ముందుకు రాబోతుంది.అదే విధంగా హిందీ లో అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మేన్, జాన్ అబ్రహం,శర్వారి, తమన్నా ల వేదా.
ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం పదిహేను చిత్రాలు సినీ ప్రియులని ఆకర్షించడానికి వస్తున్నాయి. పైగా వీటిల్లో ఆగ హీరోల సినిమాలతో పాటు మంచి కంటెంట్ తో కూడిన చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ సినీ ప్రియులకి ఆహ్లాదాన్ని పంచడం ఖాయం.
Also Read