యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై కూతురు కేసు వెనక్కి.. మరో కేసు ముందుకి
on Jul 19, 2024
ఇటీవల యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు(praneeth hanumanthu)పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. తండ్రీకుమార్తెల బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేసాడు. దీంతో ఇప్పుడు కటకటాలవెనుక ఊచలు లెక్కబెడుతున్నాడు. తాజాగా అతనిపై మరో కేసు నమోదు అయ్యింది.
ప్రణీత్ మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు రుజువయ్యింది. ఈ మేరకు మెడికల్ రిపోర్ట్ లో స్పష్టంగా వెల్లడి అయ్యింది. దీంతో ఎన్ డిపిఎస్ కింద పోలీసులు కేసు నమోదు చేసారు. మూడు రోజులు కస్టడీ కి కోరుతు కోర్ట్ లో పిటిషన్ కూడా వేశారు. దీంతో ప్రణీత్ న్యాయవాదులకి నోటీసులు వెళ్లాయి. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు.
ఇక ఈ సంఘటనతో ప్రణీత్ ఇప్పట్లో జైలు నుంచి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.సోషల్ మీడియాలో అయితే రాబోయే రోజుల్లో ప్రణీత్ విషయంలో ఇంకెన్ని విషయాలు బయటకి వస్తాయో అనే చర్చ కూడా వస్తుంది. ఇటీవల సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోంహర లో ప్రణీత్ చేసాడు. అతను సినిమాలో ఉన్నందుకు క్షమించమని కోరుతు హీరో సుధీర్ బాబు తన పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేసాడు.