రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా లావణ్య తండ్రి.. అవసరమైతే ఆస్థి మొత్తం అమ్మేస్తా
on Jul 12, 2024
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్ తరుణ్(raj tarun)లావణ్య (lavanya)విషయం హాట్ టాపిక్ అయ్యింది. రాజ్ తరుణ్ నేను పది సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. 2014 లోనే మా ఇద్దరకీ పెళ్లి అయ్యింది.రెండు సార్లు అబార్షన్ కూడా అయ్యిందని లావణ్య ఆరోపించింది. అందుకు తగ్గ ఆదారాలని కూడా పోలీసులకి చూపించింది. దీంతో రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు అయ్యింది. కాగా ఈ తంతంగం మొత్తం మీద లావణ్య తండ్రి రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
రాజ్ తరుణ్ హీరో అవ్వక ముందు నుంచి చాలా హెల్ప్ చేసాం. మనీ పరంగా కూడా చాలా హెల్ప్ చేసాం. అలాగే కరోనా అప్పుడు కూడా చాలా సహాయం చేసాం. కాకపోతే చేసిన సాయాన్ని చెప్పకూడదు. అదే విధంగా పదిహేను ఏళ్ళు నా కూతురుతో పాటు ఉండి, ఇప్పుడు డబ్బు ఇస్తానని అంటున్నాడు. మాకు డబ్బులు అక్కర్లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి నా కూతురుతో పెళ్లి జరిపిస్తాను. ఆ పెళ్ళికి మీడియా వాళ్ళని కూడా పిలుస్తానని చెప్పాడు. అదే విధంగా రాజ్ తరుణ్ వైపు వాళ్ళ వైపు నుంచి బెదిరింపులు వస్తున్నాయి. మా పాప జీవితం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే ల్యాండ్ అమ్మి అయినా ఇద్దరిని ఒకటి చేస్తానని చెప్పుకొచ్చాడు.
లావణ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతుందనే దాని మీద కూడా ఆయన తన ప్రతి స్పందనని తెలియచేసాడు. నా కూతురు ఎవరితోనో తిరిగిందని, డ్రగ్స్ వాడిందనే అబద్దాలు చెప్తున్నారు. ఒక ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేయవద్దు. ఇప్పటికి మేము రాజ్ తరుణ్ కావాలని కోరుకుంటున్నాం. ఇక నేను సినిమా వాడిని కదా అని రాజ్ తరుణ్ అనుకుంటున్నాడు.సినిమా ఫీల్డ్ లో ఎల్ల కాలం పరిస్థితులు ఒకేలా ఉండవు. మహామహుల పరిస్థితే అందుకు ఉదాహరణ. మనుషులే ముఖ్యమని తెలుసుకోవాలని సలహా ఇచ్చాడు.
Also Read