మహారాజ నటుడి మూవీ డైరెక్ట్ యూట్యూబ్ లో.. ఇన్ఫినిటీ రివ్యూ!
on Jul 12, 2024
ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకి యమ క్రేజ్ ఉంది. అయితే నెల క్రితమో సంవత్సరం క్రితమో రిలీజ్ అయిన కొన్ని సినిమాలని ఓటీటీలు భారీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాయి. అయితే అవి థియేటర్లలో హిట్టా ? ఫ్లాపా? యావరేజా అనే దాన్ని బట్టి డబ్బులు ఎంత అనేది డిసైడ్ అవుతుంది.
ప్రస్తుతం థియేటర్లలో 'కల్కి' ప్రభంజనం నడుస్తుంది. దానికి తోడు 'భారతీయుడు-2' థియేటర్లలో రిలీజ్ అయింది. సినిమాలకి వెళ్ళే టైమ్ లేని వాళ్ళు ఈ వీకెండ్ ఏదైనా థ్రిల్లర్ చూడాలనుకుంటే ' ఇన్ఫినిటీ' ట్రై చేయొచ్చు. తాజగా థియేటర్లలో రిలీజైన 'మహారాజ' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేసిన నటరాజన్ సుబ్రహ్మణ్యం అందరికి సుపరిచితమే. ఇతను తమిళంలో చేసిన మూవీ 'ఇన్ఫినిటీ'. ఇది ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి ఏ ఓటీటీలో రిలీజ్ చేయకుండా నేరుగా యూట్యూబ్ లోకి తెచ్చేశారు మేకర్స్. నటరాజన్ సుబ్రహ్మణ్యం హీరోగా విద్య ప్రదీప్, మునిష్ కాంత్, మురుగనాధం, వినోద్ సాగర్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ' ఇన్ఫినిటీ'. దీనికి దర్శకుడు సాయి కార్తిక్.
ఈ మూవీలో సీబీఐ అధికారిగా నటరాజన్ సుబ్రహ్మణ్యం నటించాడు. ఓ క్రైమ్ కి సంబంధించిన కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలుస్తాయి. ప్రథమార్ధం కాస్త స్లోగా సాగినా.. సెకెంఢాఫ్ లో వేగం పుంజుకుంటుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించరు. మనిషి బాడీలోని అవయవాలని అమ్ముకునే డాక్టర్ ల గురించి ఇప్పటికే చాలా సినిమాలు చూసాం. కానీ ఈ మూవీలో అంతకు మించి క్రైమ్ జరుగుతుంటుంది. దానిని సీబిఐ అధికారి నటరాజన్ కనిపెట్టాడా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఓసారి చూసేయ్యండి.
Also Read