నన్ను చంపొద్దు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి అమితాబ్ క్షమాపణలు!
on Jun 24, 2024
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి అమితాబ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
'కల్కి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఇంత గొప్ప సినిమాలో భాగం కావడం ఎప్పటికీ మరిచిపోలేను. నాగ్ అశ్విన్ ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇతను ఏం తింటాడు, ఇంత గొప్పగా రాశాడు అనుకున్నాను. ఈ చిత్రంలో నాది ప్రభాస్ తో తలపడే పాత్ర. ప్రభాస్ అభిమానులందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను. ఈ సినిమాలో మీ హీరోతో నేను ప్రవర్తించే తీరు చూసి దయచేసి నన్ను చంపకండి." అన్నారు. ఆ మాటలకు పక్కనే ఉన్న ప్రభాస్ నవ్వుతూ.. "వాళ్లంతా మీ అభిమానులు కూడా సార్" అన్నాడు.
Also Read