'కల్కి'లో ప్రభాస్ మెయిన్ హీరో కాదా..?
on Jun 24, 2024
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు ఇందులో 'కల్కి'గా ప్రభాస్ కనిపించనున్నాడని భావించారంతా. కానీ ఎప్పుడైతే ప్రభాస్ 'భైరవ' రోల్ చేస్తున్నాడని రివీల్ అయిందో.. అప్పటి నుంచి కల్కి పాత్ర ఎవరు చేస్తున్నారనే చర్చ మొదలైంది. భైరవతో పాటు కల్కి రోల్ లో కూడా ప్రభాసే కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ కల్కి పాత్రకి సంబంధించి మరో కొత్త ప్రచారం మొదలైంది.
'కల్కి 2898 AD' చిత్రంలో కల్కి పాత్రలో వేరే హీరో కనిపిస్తాడని, అతన్ని సేవ్ చేసే భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇంకా కొందరైతే ఒకడుగు మందేసి.. కల్కి రోల్ లో విజయ్ దేవరకొండ కనిపించాడనున్నాడని కూడా అంటున్నారు. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. విజయ్ ప్రత్యేక పాత్రలో మాత్రమే కనిపిస్తాడని, అది కూడా అర్జనుడి పాత్ర అని సమాచారం.
అభిమానులు ముందు నుంచి కోరుకుంటున్నట్లుగానే కల్కి రోల్ లో ప్రభాసే కనిపిస్తాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కల్కి, భైరవ పాత్రలు వేరు కాదట. రెండూ ఒకటేనట. కల్కినే టైం ట్రావెల్ చేసి.. భైరవగా వచ్చి.. కలి నుంచి తనని, తన తల్లిని కాపాడతాడట. కాబట్టి 'కల్కి 2898 AD'లో ప్రభాస్ ది కల్కి పాత్ర కాదని, కేవలం కల్కిని సేవ్ చేసే భైరవ పాత్ర మాత్రమే అనే ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ కి మరో రెండు రోజుల్లో తెరపడనుంది.
Also Read