బాలయ్యని కామెడీగా తీసుకోవద్దు.. మాఫియా డాన్ అయినా పర్లేదు
on Jun 24, 2024
.webp)
నందమూరి నట సింహం బాలకృష్ణ (balakrishna)అంటేనే మాస్. మాస్ అంటేనే నందమూరి బాలకృష్ణ. ఈ మాట అబద్దం అని చెప్పే సాహసం ఏ తెలుగు సినిమా ప్రేక్షకుడు చెయ్యడు.ఎందుకంటే బాలయ్య మూడున్నర దశాబ్దాల నుంచి తనదైన మాస్ విశ్వరూపంతో వాళ్ళందర్నీ అలరిస్తు వస్తున్నాడు. క్లాస్ ప్రేక్షకుల్ని సైతం మాస్ ప్రేక్షకులుగా మార్చిన రికార్డు బాలయ్యది. లేటెస్ట్ గా ఆయన కొత్త మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
బాలకృష్ణ తన అప్ కమింగ్ మూవీని బాబీ (bobby)దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది. ఎన్ బికే 109 గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యింది. అందులో కొత్త బాలకృష్ణ ని చూడబోతున్నామనే విషయం అందరకి అర్ధమయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడొక న్యూస్ అభిమానులని ఆకర్షిస్తుంది. మాఫియా డాన్ గా బాలయ్య చెయ్యబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య క్యారక్టర్ లోని డెప్త్ ఎంతో పవర్ ఫుల్ గా, నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. పైగా ఫుల్ ఎంటర్ టైయినింగ్ యాంగిల్ కూడా ఉంటుందనే టాక్ వినపడుతుంది.ఫ్యాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయని లెవల్ లో బాలయ్య పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది.
.webp)
ఇక ఈ న్యూస్ విన్న అభిమానులైతే అమ్మ చేతి వంట బాలయ్య మాస్ సినిమా ఎప్పుడు బోరు కొట్టవని, తప్పని సరిగా మూవీలో మాస్ అంశాలు కూడా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌటేలా,చాందిని చౌదరి, బాబీ డియోల్, ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ సినిమాపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



