డ్యాన్సర్ టు డిప్యూటీ సీఎం వైఫ్.. ఎవరిది అదృష్టం, ఎవరిది దురదృష్టం?
on Jun 24, 2024

ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయం జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజ్నెవా (Anna Lezhneva) విషయంలో అదే జరిగింది. 'తీన్ మార్' సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) భార్యగా లెజ్నెవా ఎంతో గౌరవం పొందుతున్నారు.
అన్నా లెజ్నెవా రష్యాకు చెందిన నటి, మోడల్. ఆమె 'తీన్ మార్' చిత్రంలో నటించారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ పాటలో మెరిశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి, అది కాస్తా ప్రేమగా మారింది. 2012 లో రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్.. 2013 లో అన్నా లెజ్నెవా ను వివాహం చేసుకున్నారు. అప్పటికే టాలీవుడ్ లో పవన్ చాలా బిగ్ స్టార్. సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో.. ఆయన 2014 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రిస్క్ చేశారు. గత పదేళ్లలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గత ఐదేళ్ళలో అప్పటి అధికార పార్టీ వైసీపీ.. పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, విమర్శలు చేసింది. వాటన్నింటినీ తట్టుకొని పవన్ నిలబడ్డారు. ఆ కష్ట సమయంలో ఆయన భార్య అన్నా లెజ్నెవా అండగా నిలిచారు. అలా పవన్ గెలుపులో భాగమై.. ఇప్పుడు డిప్యూటీ సీఎం భార్యగా గౌరవ మర్యాదలు పొందుతున్నారు.

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో తన జనసేన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా.. డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో అభిమానులు పంచుకున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీన్మార్ సమయంలో పవన్ కళ్యాణ్- అన్నా లెజ్నెవా కలిసున్న ఫొటోని, రీసెంట్ గా వాళ్ళిద్దరూ కలిసున్న ఫొటోని జత చేసి.. "How It Started... How It's Going..." అని రాసుకొచ్చారు. ఈ ఫొటోని చూసి పవన్ అభిమానులు మురిసిపోతున్నారు. పవన్ వ్యక్తిగత జీవితంలో, రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన.. అన్నా లెజ్నెవాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరికొందరైతే.. అన్నా లెజ్నెవా తో పోలుస్తూ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ని దురదృష్టవంతురాలిగా వర్ణిస్తున్నారు. పవన్ నుంచి విడిపోకుండా ఉన్నట్లయితే.. అన్నా లెజ్నెవా స్థానంలో డిప్యూటీ సీఎం భార్యగా రేణు దేశాయ్ గౌరవ మర్యాదలు పొందేవారని అంటున్నారు. ఈ విషయంలో "అన్నా లెజ్నెవా ది అదృష్టం, రేణు దేశాయ్ ది దురదృష్టం" అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ ని రేణు దేశాయ్ తప్పుబడుతున్నారు. విడాకులు తీసుకున్నంత మాత్రాన ఎవరూ దురదృష్టవంతులు కారని, తన జీవితం పట్ల తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని రేణు చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



