నాగబాబు ‘పరువు’ రివ్యూ
on Jun 15, 2024
వెబ్ సిరీస్ : పరువు
నటీనటులు: నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య, నాగబాబు, బిందు మాదవి, సునీల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్ తదితరులు
ఎడిటింగ్: విప్లవ్
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్
నిర్మాతలు: సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ దర్శకత్వం: సిద్దార్థ్ నాయుడు
ఓటీటీ: జీ5
కథ:
పల్లవి, సుధీర్ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. ఆ పెళ్ళి పల్లవి వాళ్ళ పేరేంట్స్ కి ఇష్టం లేకపోవడంతో వాళ్ళు తనని దూరం పెడతారు. అయితే ఒకరోజు పల్లవి వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడని తెలిసి పల్లవి, సుధీర్ గుంటూరుకి కారులో బయల్దేరతారు. అయితే పల్లవి వాళ్ళ బావ చందుకి నచ్చకపోయిన పల్లవి , సుధీర్ లని కారు ఎక్కించుకోవాల్సి వస్తుంది. సుధీర్ ని చందు తక్కువ చేసి మాట్లాడటంతో పల్లవి తట్టుకోలేకపోతుంది. మరోవైపు చందు దగ్గర తుపాకీ చూసిన పల్లవి తనకోసమే అని భావించి చందుని అనుమానిస్తుంది. అదేసమయంలో చందుని సుధీర్ ఒక ఇనుప రాడ్డుతో కొడతాడు. దాంతో అక్కడికక్కడే చందు చనిపోతాడు. ఇక బాడినీ ఎలా మాయం చేయాలా అని ఇద్దరు ఆలోచిస్తారు. అదే సమయంలో చందుతో పెళ్ళి నిశ్చయమైన స్వాతి( ప్రణీత పట్నాయక్) తనకి తెలిసినవాళ్ళకి కాల్ చేస్తుంది. మరోవైపు రామయ్య ఇద్దరిని వెంబడిస్తూ ఉంటాడు. అసలు చందు, రామయ్యలకి మధ్య సంబంధం ఏంటి? పెదనాన్న చివరి చూపు కోసం వచ్చిన పల్లవికి ఎదురైన సమస్యలేంటని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా మొదట్లోనే ఓ అమ్మాయి ఇంట్లో నుండి పారిపోవడం, మరోవైపు హీరో, హీరోయిన్ కార్ లో వెళ్తుంటే అలా జరగడం అన్నీ కూడా వర్కవుట్ అయ్యాయి. కథ మొదటి ఎపిసోడ్ చివరి వరకు ఒకే టెంపోలో వెళ్తుంది.
రామయ్య, స్వాతి, పల్లవి, సుధీర్ ఈ పాత్రలు అందరికి గుర్తుంటాయి. అయితే రెండో ఎపిసోడ్ నుండి కొత్త పాత్రలు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. కథలో క్యారెక్టర్లు పెరుగుతున్న కొద్దీ కథనం అర్థం కాదు. కాస్త కన్ఫూజన్ పెరుగుతుంది. అయితే ఓ వైపు ప్రేమజంట పారిపోవడం.. మరోవైపు హీరోయిన్ పెద్దనాన్న చివరి చూపు కోసం వెళ్ళడం .. ఈ రెండింటిని ప్యార్ లాల్ గా చూపిస్తూనే మరోవైపు రామయ్య వైపు నుండి చూపిస్తాడు. ఇక్కడ ఆడియన్స్ కి కాస్త క్లారిటీ మిస్ అవుతుంది.
ఈ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయి. అయితే మొదటి ఎపిసోడ్ ఒక్కటే ముప్పై నిమిషాలు ఉంటుంది. మిగతా అన్ని ఎపిసోడ్ లు నలభై నిమిషాల పైనే ఉంటుంది. ఇక్కడ కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆడియన్ సస్పెన్స్ కోసం అంతసేపు ఎదురుచూడలేడు. కామెడీ లేని ఈ సస్పెన్స్ డ్రామా ఇంటెన్స్ గా సాగుతుంది. కొన్ని చోట్ల మనం కూడా ఏం జరుగుతుందో చెప్పేస్తాం.. అందులోను అయిదు ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంటుంది. స్క్రీన్ ప్లే కాస్త ఎంగేజింగ్ గా ఉండటంతో బోర్ కొట్టదు. అయితే చివరి ఎపిసోడ్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పటికి కథ ఇదే అనే క్లారిటీ రాదు.
ఏడు, ఎనిమిది ఎపిసోడ్ లలో క్యారెక్టర్ల మధ్య గల రిలేషన్ తెలిసాక.. అసలు మొదటి నుండి ఎమైందో తెలుస్తుంది. వేరు వేరుగా జరిగే సీక్వెన్స్ ని దర్శకుడు కలిపే విధానం థ్రిల్ ని పంచుతుంది. సినిమాలో అడల్ట్ సీన్స్ లేవు. అయితే అశ్లీల పదాలు ఎక్కువగా వాడారు. వాటిని ఫ్యామిలీతో కలిసి చూడలేం.. అవన్నీ ఆ సీన్ కి తగ్గట్టుగానే అనిపించినా ఫ్యామిలీతో కాకుండా ఇండివిడ్యువల్ గా చూస్తేనే బెటర్. క్లైమాక్స్ లో మరో సీజన్ ఉండబోతుందంటూ మరో క్యారెక్టర్ ని పరిచయం చేయడం బాగుంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివే కాస్త ఎక్కువ కానీ కథనం బాగుంటుంది. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విప్లవ్ కత్తెరకి పని చెప్పాల్సింది. కొన్ని ఎపిసోడ్ లలో అంత లెంత్ అవసరం లేదు. వాటిని ట్రిమ్ చేస్తే మరింత ఎంగేజింగ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
సుధీర్ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. పల్లవి పాత్రలో నివేదా పేతురాజ్ ఆకట్టుకుంది. రామయ్యగా నాగబాబు ఉన్నంతలో బాగా నటించాడు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : థ్రిల్ ని పంచే ఈ సీరీస్ ని చూడాలంటే కాస్త ఎక్కువ సమయం కేటాయించాలి.
రేటింగ్: 2.5/5
✍️. దాసరి మల్లేష్
Also Read