పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'RK పురంలో'..
on Apr 8, 2024
పవన్ దీపిక ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్, త్రిషల, రక్ష హీరోహీరయిన్లుగా శ్రీకర్ ప్రసాద్ కట్టా దర్శకత్వంలో రవికిరణ్ గుబ్బల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''RK పురంలో". ఈ చిత్రం తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భగా చిత్ర దర్శకుడు శ్రీకర్ ప్రసాద్ కట్టా మాట్లాడుతూ.. "నేటి యువత డ్రగ్స్ బారిన పడి ఎటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు, వారి వల్ల సమాజంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మహిళలు ఎదుర్కుంటున్నారు అనేది ఈ చిత్ర కథాంశం. హీరో రవి కిరణ్ కొత్తవాడైన చాలా చక్కగా నటించాడు. రాజ్ కిరణ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అన్ని హంగులతో ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం." అని అన్నారు.
చిత్ర నిర్మాత గుబ్బల రవి కిరణ్ మాట్లాడుతూ.. "సమాజానికి ఉపయోగపడే మంచి పవర్ ఫుల్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాను. మా చిత్రంలో యూత్ కి కావలసిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసుకుని సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నాం." అని అన్నారు.
రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కె. వాసుదేవన్, ఎడిటర్ గా డి.కె వ్యవహరిస్తున్నారు.
Also Read