దర్శకులు పెద్ద నటరత్నాలు..సినిమా కోసం ప్రాణాలు కూడా ఇస్తా
on Jan 22, 2024
ఒక సినిమాకి డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా వ్యవహరిస్తాడు. 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండి సినిమా బాగా రావడానికి కృషి చేస్తాడు. తద్వారా ఆ సినిమాలో నటించే హీరోకి దర్శకుడుకి కూడా మంచి పేరు వస్తుంది. అలాంటి దర్శకులు నటులు కాదు నట రత్నాలు అని ఒక దర్శకుడు చెప్తుండటం టాక్ ఆఫ్ ది తెలుగు సినిమా ఇండస్ట్రీగా మారింది.
గతంలో కొన్ని సినిమాలకి దర్శకుడుగా వ్యవహరించిన శివనాగు దర్శకత్వంలో నటరత్నాలు అనే చిత్రం తెరకెక్కింది. విభిన్న కాన్సెప్ట్ తో కూడుకున్న ఈ కథలో పలు హిట్ సినిమాలకి దర్శకత్వాన్ని వహించిన దర్శకులు రవి కుమార్ చౌదరి,
సూర్యకిరణ్ లు కూడా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతు సినిమా అంటే నాకు ప్రాణం సినిమా కోసమే పుట్టాను సినిమా కోసమే మరణిస్తాను అని చెప్పాడు. సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీ కి వచ్చి ఎలా సక్సెస్ అవుతున్నారు ఎలా విఫలమవుతున్నారు అనే పాయింట్ తో నట రత్నాలు తెరకెక్కించానని మూవీ ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని కూడా ఆయన చెప్పాడు.
క్రైమ్ కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ నటరత్నాలులో అర్చన శాస్త్రి, ఇనయ సుల్తానా, రంగస్థలం మహేష్, సుదర్శన్ రెడ్డి ,తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలని పోషించారు. చందనా ప్రొడక్షన్స్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ పై చంటి యలమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అతి త్వరలోనే మూవీ విడుదల కానుంది
Also Read