ఎన్టీఆర్ గురించి మొరగడం తగ్గించుకోండి.. ఫ్యాన్స్ హెచ్చరిక!
on Oct 25, 2023
ఎ.పి. మాజీ సి.ఎం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. వారిలో రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, నటీనటులు ఎంతో మంది ఉన్నారు. కానీ, హీరో ఎన్టీఆర్ మాత్రం మౌనంగానే ఉన్నారు. దీన్ని తప్పుబడుతూ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. ఎన్టీఆర్ స్పందించడం లేదంటూ కామెంట్ చేసేవారి గురించి ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్.
తాజాగా చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ స్పందన విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో వెలిసిన ఫ్లెక్సీ. ఇప్పుడీ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫ్లెక్సీలో ‘‘మనిషి మౌనం వెనక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇక ఛాన్స్ దొరికితే చాలు బురద చల్లే వర్గం మీరు. విషయంపై స్పందించమంటారు. స్పందిస్తే.. నోటికొచ్చినట్లు తిడతారు. దయచేసి మీరు జూనియర్ ఎన్టీఆర్ గురించి మొరగడం తగ్గించుకుంటే మంచిది. రాజకీయాల్లోకి మా హీరోని లాగొద్దు’’ అంటూ ఈ ఫ్లెక్సీ ద్వారా వార్నింగ్ ఇచ్చారు ఫ్యాన్స్. మరి ఈ ఫ్లెక్సీపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read