ప్రభాస్ పుట్టిన రోజున ఖరీదైన కారు కొన్న ప్రభాస్ హీరోయిన్
on Oct 25, 2023
80,90 వ దశకాల్లో బాలీవుడ్ మొత్తాన్ని తన విలనిజంతో భయపెట్టిన నటుడు శక్తి కపూర్. హీరో లతో పాటు సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న రికార్డు శక్తి కపూర్ సొంతం. ప్రస్తుతం బాలీవుడ్ లో శక్తి కపూర్ నటనా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న నటి శ్రద్దకపూర్. శక్తి కపూర్ ఒక్కగానొక్క కూతురు శ్రద్ద కపూర్. అతి తక్కువ కాలంలోనే ఎన్నో సినిమాల్లో నటించి శ్రద్ద కపూర్ తన తండ్రి లాగానే మంచి ఆర్టిస్ట్ అనే పేరుని సంపాదించుకుంది. తాజాగా శ్రద్ధ చేసిన ఒక పనికి అందరు వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు.
శ్రద్ద కపూర్ తాజాగా విజయదశమి రోజున ఒక కొత్త కారుని కొంది. కొత్త కారు అంటే అలాంటి ఇలాంటి కారు కాదు. లంబోర్గిని హూరాకేన్ టెక్నీకా అనే కంపెనీ కి చెందిన కారు ని కొంది. శ్రద్ద కొత్త కారు కొంది అయితే ఏంటంటా అని అనుకోకండి. శ్రద్ద కొన్న ఆ కొత్త కారు ఖరీదు అక్షరాలా 5 కోట్లు. ఇప్పుడు ఆ కారు ఖరీదు తెలుసుకున్న వాళ్ళందరూ ఒక్క సారిగా వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. కొంత మంది అయితే శ్రద్ద కపూర్ అంటే ఆ మాత్రం ఉండాలిలే అని అనుకుంటున్నారు. సోషల్ మీడియా లో తన కారు పిక్స్ ని శ్రద్ద పోస్ట్ చేసింది.
ప్రస్తుతం శ్రద్ద స్ట్రీట్ నెంబర్ 2 సినిమాలో నటిస్తుంది. కాగా శ్రద్ద తెలుగు లో ప్రభాస్ కి జోడిగా సాహో సినిమా లో నటించింది. శ్రద్ద అండ్ ప్రభాస్ ఫెయిర్ సూపర్ గా ఉందని మూవీ చూసిన ప్రతి ఒకరు అన్నారు. కాగా ప్రభాస్ పుట్టిన రోజు నాడే (అక్టోబర్ 23 ) శ్రద్ధ ఖరీదయిన కారు కొనటం తో ప్రభాస్ కి గిఫ్ట్ ఏమైనా ఇవ్వడానికేమోనని ప్రభాస్ ఫాన్స్ సరదాగా అనుకుంటున్నారు.
Also Read