డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతున్న హీరో
on Oct 18, 2023

వరుస సినిమాలతో టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న నటుడు విశ్వేక్ సేన్ .అతి కొద్ది కాలంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఓటిటి వేదికగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో ప్రసారమయ్యే ఫ్యామిలీ ధమాకా షో కి విశ్వక్ సేన్ యాంకరింగ్ చేషున్నాడు. ఆల్రెడీ షో కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఇప్పుడు దసరా సందర్భంగా టెలి కాస్ట్ అయ్యే కంటెంట్ కి సంబంధించిన ప్రోమోని ఆహా వాళ్ళు రిలీజ్ చేసారు. ఆ ప్రోమో మాములుగా లేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది.
దసరా కి టెలికాస్ట్ అయ్యే ఈ షో లో యంగ్ హీరోయిన్లు చాందిని,సిమ్రాన్ చౌదరి, బిగ్ బాస్ తేజస్వి అనిషా,అనన్య లు ప్రేక్షకులని కనువిందు చెయ్యనున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో విశ్వక్ సేన్ తన పక్కనే ఉన్న అనన్య ని ఉద్దేశించి అనన్యకి నేనంటే చాలా కోపం ఎందుకంటే తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హోలీ పండగ వచ్చింది. ఆ రోజు తన మీద కలర్ కొట్టి వాటర్ కొట్టాను దాంతో అనన్య అలిగి వెళ్లిపోయింది అని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది ఆ పై వెంటనే మరి నా మీద ఎప్పుడు కొడతావు అని తేజస్వి అడగగానే నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు అని విశ్వక్ సేన్ అన్నాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ జరిగాయి.
తేజు నువ్వు ముగ్గు ఎందుకు వేస్తావు ముగ్గులోకి దించుతావు కానీ అని విశ్వక్ సేన్ తేజస్విని అనడంతో పాటు నాకిప్పుడు నాలుగేళ్లు నువ్వు నా బామ్మవి అని కూడా విశ్వక్ సేన్ అనగానే తేజస్వి విశ్వక్ సేన్ ని చిన్నపిల్లవాడిలా భావించి ఏమైంది నాన్న ఎందుకు తినడంలేదు అని అంది.దానికి బదులుగా నేను ముద్ద తినను అని విశ్వక్ సేన్ అనగానే ముద్దు కావాలా అని తేజస్వి అనడంతో షో మొత్తం ఎంత బోల్డ్ గా ఉండబోతుందో అందరికి అర్ధం అయ్యింది. అలాగే మరో కంటెస్ట్ విశ్వక్ సేన్ ని సమోసా తింటావా విశ్వక్ అని అడగగానే నువ్వు ఉండగా సమోసా ఎందుకు అని విశ్వక్ సేన్ అన్నాడు. దీంతో ఈ దసరాకి ధమాకా షో లో ఫుల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మోత మోగిపోవడం ఖాయమని ప్రోమో చూసిన వాళ్ళు చెప్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ప్రోమో మోత మోగిపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



