'చంద్రముఖి-2' మూవీ రివ్యూ
on Sep 28, 2023
సినిమా పేరు: చంద్రముఖి- 2
తారాగణం: లారెన్స్, కంగనారనౌత్, మహిమానంబియార్, రాధిక, లక్ష్మి మీనన్, వడివేలు, రావు రమేష్, అయ్యప్పపి.శర్మ, సుభిక్ష, సురేష్ చంద్ర మీనన్, ఆత్మిక ,విగ్నేష్ తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సినిమాటోగ్రాఫర్: ఆర్.డి రాజశేఖర్
ఎడిటర్: అంథోని
రచన, దర్శకత్వం: పి .వాసు
నిర్మాత: సుభాస్కరన్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023
2005వ సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభు, జ్యోతిక ల కాంబినేషన్ లో వచ్చిన చంద్రముఖి సినిమా సాధించిన ఘనవిజయం నేపథ్యంలో లారెన్స్, కంగనారనౌత్ ల చంద్రముఖి 2 సినిమా మీద సినీ ప్రేమికులు ఎన్నో అంచనాలని పెట్టుకున్నారు. కంగనా రనౌత్ చంద్రముఖి గా ఎలా చేస్తుంది పైగా లారెన్స్ రజనీకాంత్ పోషించిన క్యారక్టర్ ని ఎలా స్క్రీన్ మీద పండిస్తాడు అని అలాగే చంద్రముఖి అండ్ చంద్రముఖి ప్రేమికుడ్ని చంపి చంద్రముఖి ఆత్మ క్షోభ కి కారణమైన వెట్టియన్ రాజా ల అసలు కథ ని చెప్పబోవడంతోపాటు వాళ్ళ ఆత్మలు మళ్ళీ తిరిగివస్తాయి అని చంద్రముఖి మూవీ మేకర్స్ చెప్పడం తో ప్రేక్షకులు అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూసారు. మరి ఈ రోజు రిలీజ్ అయిన చంద్రముఖి 2 మూవీ వాళ్ళ అంచనాలని అందుకుందా?
కథ:
రంగనాయకి(రాధిక) తన కుటుంబంలో ఉన్న కీడుని పోగొట్టుకోవడం కోసం తన పూర్వికులు కట్టించిన అమ్మ వారి గుడిలో పూజలు చేయించడానికి తన కుటుంబంతో సహా గ్రామానికి వచ్చి చంద్రముఖి ఆత్మ ఉన్న ఇంటిలో దిగుతారు. వాళ్ళతో పాటు తనకి నచ్చని పెళ్లిచేసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత చనిపోయిన తన కూతురి కొడుకు, కూతురు కూడా వస్తారు. కానీ వాళ్లంటే రాధిక కి మిగిలిన కుటుంబ సభ్యులకి చాలా కోపం. పిల్లలకి గార్డియన్ గా మదన్(లారెన్స్) వస్తాడు. పిల్లలని ఏమైనా అంటే అసలు ఒప్పుకోడు. పిల్లలని వాళ్ళ ఫామిలీకి దగ్గర చేయడానికి చూస్తుంటాడు. ఇంకో పక్క ఆ ఇంటి ఓనర్ అయిన వడివేలు ఇంటిలోని దక్షిణ గది కి మాత్రం ఎవరు వెళ్లొద్దని అంటూ ఎలాగైనా సరే ఆ బిల్డింగ్ ని రాధిక వాళ్ళకి అమ్మాలని చూస్తుంటాడు. లారెన్స్ మాత్రం ఆ ఇంట్లో ఏదో ఉందని అనుకుంటూ ఉంటాడు . రాధిక కి కాళ్ళు చేతులు పనిచేయని కూతురు కూడా ఉంటుంది. ఆ ఇంటికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో పూజ అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది.ఈ పూజానే హీరోయిన్. ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడాని ఆత్రపడే పూజ తమ ఎదురుగా ఉన్న కోట లాంటి పెద్ద ఇంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనే దాంట్లో భాగంగా మదన్ కి దగ్గర అయ్యి మదన్ ప్రేమలో పడుతుంది. ఇంక తాము వచ్చిన పని ప్రకారం రంగనాయకి వాళ్ళు పాడు పడిపోయిన అమ్మవారి గుడిని శుభ్రం చేయిస్తుంటే పని చేసే వాళ్ళు చనిపోవడం తో పాటు రంగనాయకి వాళ్ళ ఇంట్లో ఉన్న చంద్రముఖి ఆత్మ అమ్మవారి గుడిలో దీపం వెలిగితే వెట్టియన్ రాజా మళ్ళి వస్తాడని పూజ చెయ్యొద్దని పెద్ద పెద్ద గా అరుస్తూ ఉంటుంది. దీంతో రంగనాయకి అండ్ ఫామిలీ మొత్తం భయపడతారు.పైగా చంద్రముఖి గదిలోకి వెళ్లిన రంగనాయకి అవిటి కూతురి శరీరంలోకి చంద్రముఖి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చంద్రముఖి ఎందుకు తిరిగొచ్చింది? వేట్టయ్య రాజా కథ ఏంటి? అనేవి మిగతా కథలో చూస్తాం.
విశ్లేషణ:
సినిమా విషయానికి వస్తే నూటికి నూరుపాళ్లు ఇది మంచి కథే. చంద్రముఖి, వేట్టయ్య రాజా ల గతం గురించి చెప్పాలనుకోవడం ముమ్మాటికీ మంచి థాట్. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ మాత్రం రాంగ్. ఒక ఇంటికి అందరు రావటం భయపడుతూ ఉండటం అనేది చంద్రముఖి ఫస్ట్ పార్ట్ లోనే కాకుండా ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతెందుకు పి.వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి పాత్రతోనే వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లిలో కూడా ఇంటి వాతావరణమే ఉంది.అలా కాకుండా డైరెక్టుగా చంద్రముఖి ,వెట్టియన్ రాజా ల పాత కథకి వెళ్లి ఆ బ్యాక్ డ్రాప్ లోనే కథ చెప్తే బాగుండేదేమో . ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే చంద్రముఖి కి భయపడాలని ప్రిపేర్ అయ్యే వెళ్తారు కాబట్టి థియేటర్స్ లో ఎవరు కూడా భయపడరు. అలాగే భయపడేలా కూడా సీన్స్ లేవు. మొదటి పార్ట్ లో ఉండే థ్రిల్, కామెడీ సెకండ్ పార్ట్ లో కనిపించలేదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
సినిమా రిజల్ట్ ఎలా ఉన్న కూడా ఈ సినిమా కి ఉన్న బలం ఏంటంటే ఈ సినిమా లో నటించిన ఆల్ ఆర్టిస్ట్స్ అండ్ టెక్నియషన్స్. అందరు కుడా సూపర్ గా చేసారు. ఫోటోగ్రఫీ అయితే సూపర్ గా ఉంది మన చూపుల్ని పక్కకి తిప్పుకోలేని విధంగా చేసింది. పి. వాసు డైరెక్షన్ కూడా సూపర్ గా ఉంది.ఆయన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో కూడా ఆల్రెడీ అందరికి తెలుసు. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ చాలా బాగుంది. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. ఇంక నటీనటుల విషయానికి వస్తే లారెన్స్ ,కంగనా రనౌత్,రాధిక అలాగే హీరోయిన్ పాత్ర పోషించిన మహిమా నంబియార్ అండ్ లక్ష్మి మీనన్ లు సూపర్ గా నటించారు. మహిమ నంబియార్ అయితే మాత్రం చాలా అందంగా ఉంది ,దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అయ్యే రోజు తనకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే చంద్రముఖి ఆవహించినప్పుడు లక్ష్మి మీనన్ చూపించిన ఎక్సప్రెషన్ అలనాటి జ్యోతిక ని గుర్తు చేసింది. కొన్ని ఫ్రేమ్స్ లో అచ్చం జ్యోతిక లాగానే ఉంది. వడివేలు,రావు రమేష్ ల తో పాటు మిగతా నటీనటులు కూడా చాలా చక్కగా నటించారు
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
సినీ ప్రేక్షకులకి భయాన్ని,థ్రిల్ ని కలిగించడానికి తీసిన చంద్రముఖి 2 సినిమా కథ ని చెప్పే విధానంలోని లోపాల వలన అలాగే స్క్రీన్ ప్లే లో ఉన్న లోపాల వలన ఎంతో ఆశతో థియేటర్స్ కి వెళ్లిన ప్రేక్షకులని వాళ్ళు అనుకున్న విధంగా రంజింప చెయ్యలేదు. ఎందుకంటే అన్ని తెలుగు సినిమాల్లో సినిమా చివర విలన్ ఓడిపోయి హీరో గెలిచినట్టు చంద్రముఖి 2 లో వెట్టియన్ రాజా ,చంద్రముఖిలు మళ్లీ తమ గది తలుపులు ఎవరైనా తెరిస్తే వాళ్ళ ఆత్మల్లోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా సినిమా క్వాలిటీ, మేకింగ్ అయితే మాత్రం కన్నుల పండుగగా ఉంది. కానీ అవసరమైన సీన్స్ కి తక్కువ డ్యూరేషన్ తో చెప్పడం అనవసరమైన సీన్స్ ని ఎక్కువ లాగ్ తో తెరకెక్కించడం ఈ సినిమా మెయిన్ మైనస్.
రేటింగ్: 2.25/5
-అరుణాచలం
Also Read