నయన్ `నెట్రిక్కన్`కి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
on Jul 29, 2021
లేడీ సూపర్ స్టార్ నయనతార అంధురాలి పాత్రలో నటించిన సినిమా `నెట్రిక్కన్`. కొరియన్ ఫిల్మ్ `బ్లైండ్` (2011)కి రీమేక్ గా తెరకెక్కిన ఈ తమిళ థ్రిల్లర్ ని `గృహం` ఫేమ్ మిలింద్ రావ్ డైరెక్ట్ చేశాడు. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుందంటూ గత కొద్ది రోజులుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.
కాగా, గురువారం (జూలై 29) రిలీజ్ చేసిన `నెట్రిక్కన్` ట్రైలర్ లో స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. పంద్రాగస్టు వారాంతం ప్రత్యేకంగా ఆగస్టు 13న `నెట్రిక్కన్`ని స్ట్రీమ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మరి.. గత ఏడాది దీపావళికి `మూక్కుత్తి అమ్మన్` (తెలుగులో `అమ్మోరు తల్లి`)తో ఇదే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇంప్రెస్ చేసిన నయన్.. ఈ పంద్రాగస్టు వారాంతంలో `నెట్రిక్కన్`తోనూ ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.
Also Read