ఫొటో స్టోరీ.. బెంగళూరులో నిధి అగర్వాల్ ఇల్లు ఎలా ఉంటుందో చూశారా?
on Jul 29, 2021
చేసింది తక్కువ సినిమాల్లో అయినా మంచి పాపులారిటీ తెచ్చుకున్న తారల్లో నిధి అగర్వాల్ ఒకరు. హిందీ మూవీ 'మున్నా మైఖేల్'తో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ 'సవ్యసాచి'తో టాలీవుడ్లోక అడుగుపెట్టింది. 'మిస్టర్ మజ్ను' తర్వాత రామ్ సరసన నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి కెరీర్‌కు బూస్ట్‌నిచ్చింది. ఇప్పుడు ఏకంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాల్లో నాయికగా నటిస్తోంది. సోషల్ మీడియాలో నిధికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు.
షూటింగ్ లేకపోతే ఎక్కువసేపు ఇంట్లోనే గడుపుతుంటుంది నిధి. విలాసవంతమైన వాళ్ల ఇల్లు చక్కని ఇంటీరియర్‌తో ఆకట్టుకుంటూ ఉంటుంది. పొందికగా ఉండే కిచెన్ కానీ, క్వీన్ సైజ్ బెడ్రూమ్ కానీ.. ఎవరైనా కలలు కనేవిధంగా తీర్చిదిద్దినట్లు ఉంటుంది ఆ ఇల్లు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసే ఫొటోలను చూస్తే, తన పెట్స్‌తో ఆడుకొనే లివింగ్ రూమ్, గేమ్స్ ఆడుకొనే బెడ్రూమ్, రుచికరమైన ఫుడ్ తయారుచేసుకొనే కిచెన్ ఆమెకు బాగా ఇష్టమైన ప్రదేశాలుగా అనిపిస్తాయి. ఒక్కసారి బెంగళూరులోని నిధి అగర్వాల్ ఇల్లు ఎలా ఉంటుందో లుక్కేద్దాం...