తెలుగు తెరపై 'జాతిరత్నాలు' ఎవరో తెలుసా?
on Sep 11, 2019
మగజాతి ఆణిముత్యం అంటే తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి గుర్తొస్తాడు. 'లవర్స్' సినిమాలో అతడు చేసిన కామెడీని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. మరి, 'జాతి రత్నాలు' అంటే ఎవరు గుర్తొస్తారో తెలుసా? ప్రస్తుతానికి ఎవరూ రారు కానీ, కొన్ని రోజుల తర్వాత నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ గుర్తుకు వస్తారు. 'మహానటి' దర్శకుడు నాగఅశ్విన్ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. కొత్తగా ప్రొడక్షన్ హౌస్ పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే... వైజయంతి మూవీస్ సంస్థ మామగారు అశ్వినీదత్ ది. స్వప్న సినిమా సంస్థలో ఆయన భార్య ప్రియాంక పార్ట్నర్. ఇంట్లో రెండు ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. కానీ, కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాణంలోకి నాగఅశ్విన్ వస్తున్నట్టున్నారు.
స్పై థ్రిల్లర్ కామెడీ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో హీరోగా పరిచయమైన నవీన్ పోలిశెట్టి హీరోగా నాగఅశ్విన్ ప్రొడక్షన్ లో స్వప్న సినిమా పతాకంపై 'జాతి రత్నాలు' తెరకెక్కుతోంది. 'పిట్టగోడ' ఫేమ్ అనుదీప్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. వీరందరూ కలిసి ప్రేక్షకులకు ఫుల్లుగా నవ్వించడానికి సిద్ధమైనట్టున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో సినిమా షూటింగ్ సైలెంట్ గా స్టార్ట్ చేశారని టాక్.