కోమాలో అభిమాని ఉంటే..విజయ్ పై నాజర్ కీలక వ్యాఖ్యలు
on Dec 31, 2024
దక్షిణ భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని నటుడు నాజర్(nassar).1985 లో సినీ రంగ ప్రవేశం చేసిన నాజర్ అన్ని భాషల్లో కలిపి సుమారు 550 సినిమాల దాకా చేసాడు. ప్రతి సినిమాలోను ఆయన క్యారక్టర్ ని దర్శకులు ప్రత్యేకంగా డిజైన్ చేస్తారంటే నాజర్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కిన 'మాతృదేవోభవ' తో తెలుగు వారి అభిమాన నటుడుగా మారాడు.దర్శకుడుగా,నేపధ్య గాయకుడు గా కూడా తన సత్తాచాటిన నాజర్ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నాడు
రీసెంట్ గా నాజర్ ఒక ఇంటర్వ్యూలో తమిళ అగ్ర హీరో,ఇటీవల తమిళగ వెట్రి కజగం' పార్టీ ని స్థాపించిన విజయ్(vijay)తమ జీవితాల్లో ఎంత ప్రత్యేకమో చెప్పడం జరిగింది.ఆయన మాట్లాడుతు 2014 లో నా కొడుకు యాక్సిడెంట్ కి గురయ్యి పద్నాలుగు రోజులు కోమాలో ఉన్నాడు. స్పృహ లోకి వచ్చాక తల్లితండ్రులు పేర్లు చెప్పకుండా విజయ్ పేరు చెప్పాడు.మా అబ్బాయి విజయ్ కి వీరాభిమాని. ప్రతి సినిమా చూసి విజయ్ లాగా అనుకరిస్తూ ఉంటాడు.అలా చేస్తుండటం వల్లే యాక్సిడెంట్ జరిగినా కూడా మా అబ్బాయి జ్ఞాపక శక్తి తో ఉన్నాడు.దాంతో విజయ్ సినిమాలని పాటలని చూపించమని డాక్టర్స్ చెప్పారు.దాంతో మా అబ్బాయి కోలుకోవడం జరిగింది.
ఈ విషయం తెలిసీ విజయ్ మా అబ్బాయిని కలిసాడు.అప్పట్నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.మా అబ్బాయికి ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని కూడా విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడు.ఈ విధంగా విజయ్ మా జీవితంలో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు.నాజర్ ప్రస్తుతం తమిళ నడిగర్ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read