అగ్రహీరో సినిమాపై జాన్వీకపూర్ కామెంట్స్..కడుపులో ఉన్నదంతా వెళ్లగక్కింది
on Dec 31, 2024
'ఎన్టీఆర్'(ntr)వన్ మాన్ షో 'దేవర'(devara)తో తెలుగు సినీ రంగానికి పరిచయమైన భామ జాన్వీ కపూర్(janhvi kapoor).మొదటి సినిమాతోనే తన తల్లి శ్రీదేవి లా మంచి అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది.రామ్ చరణ్,ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న నూతన చిత్రంలోను జాన్వీ నే హీరోయిన్.
రీసెంట్ గా జాన్వీ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేస్తు 'అమరన్' మూవీ చూసాను.ప్రతి సన్నివేశం భావోద్వేగంతో నిండి నా హృదయాన్ని కలిచి వేసింది.ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి.మూవీ చూడటం లేట్ అయ్యినా కూడా ఈ ఏడాదిని 'అమరన్' చూడటంతో ముగించాను.ఈ ఏడాది కి 'అమరన్' నే బెస్ట్ సినిమా అని చెప్పుకొచ్చింది.
తమిళనాడు కి చెందిన దివంగత 'మేజర్ ముకుంద వరద రాజన్'(major mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అనే విషయం తెలిసిందే.శివ కార్తికేయన్,సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ ని అగ్ర హీరో కమల్ హాసన్ నిర్మించాడు.రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు కాగా ప్రస్తుతం ఈ మూవీ పాన్ ఇండియాకి సంబంధించిన అన్ని భాషల్లోను అందుబాటులో ఉంది.