8 పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో
on May 25, 2015
ఏస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై... మిర్చి, రన్‌రాజారన్, జిల్ లాంటి హ్యట్రిక్ సూపర్ డూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న క్రేజి ప్రొడక్షన్ హౌస్ UV Creations సంయుక్తంగా ప్రొడక్షన్ నెం-1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భలే భలే మగాడివోయ్. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. వరుస విజయాలతొ యూత్ లో ఐకాన్ డైరక్టర్ గా బ్రాండ్ వేసుకున్న మోస్ట్ క్రేజియస్ట్ డైరక్టర్ మారుతి దర్శకుడు. హ్యట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ టాలెంటెడ్ నిర్మాత బన్నివాసు నిర్మాత. ఇప్పటికే రెండు పాటల్ని పూర్తిగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం రామెజీ ఫిల్మ్‌సిటి లో మరో పాట చిత్రీకరణలో వున్నారు.
నాని కేరీర్ లోనే వైవిధ్యమైన పాత్ర:
తన కేరీర్ స్టార్టింగ్ నుంచి చాలా వైవిధ్యమైన పాత్రలతో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హర్ట్ లో ప్లేస్ సంపాదించాడు హీరో నాని. హీరో నాని నటించే చిత్రాలంటే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వుంటాయి. నాని కి దర్శకుడు మారుతి చెప్పిన కథ నచ్చటంతో వెంటనే అంగీకరించడమే కాకుండా ఏకధాటిగా చిత్రాన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఈ చిత్రం లో నాని ఇప్పటివరకు చేయని వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తన పాత్రలోనే కామెడీ వుండటంతో నాని నటన ప్రతి ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేస్తుంది. మారుతి చెప్పిన 8 పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పి టోటల్ యూనిట్ తో క్లాప్స్ కొట్టించుకున్నారు. నాని కి ఈ చిత్రం తన కెరీర్ లోనే హైలెట్ గా నిలవనుంది.
లావణ్య త్రిపాఠి నటన మైమరిపిస్తుంది:
అందాలరాక్షసి చిత్రం లో లావణ్య తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ భలే భలే మగాడివోయ్ చిత్రంలో చక్కటి తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తుంది. తన నటనతో పక్కింటి అందమైన అమ్మాయి లా అందరి మనసులు దోచుకుంటుంది. ముఖ్యంగా నాని , లావణ్య మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ మనసుని గిలిగింతలు పెట్టేలా వుంటాయి. ఇద్దరి కెమిస్ట్రీ ఆన్‌స్క్రీన్ సూపర్బ్ గా వచ్చింది. టాలీవుడ్ లో ఆన్‌స్క్రీన్ లవ్ లీ పెయర్ గా చాలా మంది వున్నారు. ఆ లిస్ట్ లోకి నాని, లావణ్య లు చిత్రంతో చేరతారు.
కొత్త జోనర్ లో లవ్ స్టోరిని నడిపిస్తున్నదర్శకుడు మారుతి:
వరుసగా యూత్‌ఫుల్ లవ్‌స్టోరిస్ తో చిన్నచిత్రాల పెద్ద విజయాలకు బ్రాండ్ గా కేరాఫ్ ఆడ్రాస్ గా మారిన దర్శకుడు మారుతి ప్రేమకథాచిత్రం తో సరికొత్త జోనర్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. కొత్తజంట లో ఇద్దరు సెల్ఫిష్ లు లవ్ చేసుకుంటే ఆ జంట ఎలావుంటుందో చెప్పి విజయాన్ని సాధించాడు. కొంత గ్యాప్ తరువాత ఇప్పడు నాని, లావణ్య జంట గా భలే భలే మగాడి వోయ్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టోటల్ గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇది కూడా కొత్తరకం జోనర్ లో తెరకెక్కిస్తున్నాడు. హీరో నాని , హీరోయిన్ లావణ్య పాత్రలతో పాటు చిత్రంలో నటించే ప్రతి ఒక్కరి పాత్ర కూడా వైవిధ్యంగా వుండేలా తెరకెక్కించారు. చిత్రం చూసినంతసేపు నవ్వించే ప్రయత్నంగానే ఈ చిత్రం చేస్తున్నాడు. తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రాల విషయంలో ప్రేక్షకుడ్ని ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యటమే మెయిన్ కాన్సెప్ట్ గా పెట్టుకునే మారుతి ఈ సారి కడుపుబ్బ నవ్విస్తాడని యూనిట్ అంతా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.
కెరీర్ లోనే అత్యద్బుతమైన పాత్రలో నటిస్తున్న మురళి శర్మ :
ప్రముఖ బాలీవుడ్ ఆర్టిస్ట్ మురళిశర్మ ఈ చిత్రంలో చాలా కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఎన్నో చిత్రాలు చేసిన మురళి శర్మ ఈ చిత్రలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు మారుతి రచించిన డైలాగ్స్ ని 15రోజుల ముందుగా తీసుకుని ప్రిపేరయ్యి లోకేషన్‌లో యావత్ యూనిట్ ని ఆశ్చర్యపరుస్తూ సింగిల్ టేక్ లో నటించి మెప్పించి యూనిట్ లో అందరూ తన సహ నటులు చేత కూడా క్లాప్స్ కొట్టించారు. ఆయన డేడికేషన్ కి అందరూ థ్యాంక్స్ కూడా తెలిపారు. అయితే ఇలా నటించటం ఆయనకు కొత్త కాదు కాని తెలుగు లో ఇలా నటించటం మాత్రం కొత్తనే చెప్పాలి. సెలక్టివ్ గా నటించే మురళి శర్మ బాలీవుడ్ లో ఎంతో బిజిగా వున్నా కూడా దర్శకుడు మారుతి రాసిన ఈ పాత్ర మరియు కథ అమితంగా నచ్చటం వలన ఆయన నటించారు. అంతేకాదు తన కెరీర్ లోనే ఇది అతి మంచి పాత్రల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన చెప్తున్నారు.
కడుపుబ్బ నవ్వించిన వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, భద్రం:
కామెడి వుంటే చాలు సినిమాలు మినిమమ్ గ్యారేంటి గా హిట్. ఈ సూత్రాన్ని 100% నమ్మిన దర్శకుడు మారుతి తను చెప్పాలకున్నది వినోదంగా చెప్పటం మెదటినుండి అలవాటు చేసుకున్నాడు. అయితే ఈ సారి తన కామెడి డోస్ ని మరింత పెంచాడు. ఈసారి కామెడి మేకర్స్ గా టాలీవుడ్ లో బిజీగా వున్న శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్ లతో కడుపుబ్బ నవ్వించాడు. ఇటీవలే షార్ట్‌ఫిలింస్ తో కామెడి లో దూసుకెళుతున్న భద్రం తో వైవిద్యమైన కామెడీ ని చేయించారు మారుతి.
జాతీయ అవార్డు గ్రహీత గోపిసుందర్ మ్యూజిక్ ప్రదాన హైలెట్:
నేషనల్ అవార్డు విన్నర్ గోపిసుందర్ కంపోజిషన్ కేరళ లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయనిచ్చిన పాటలు సూపర్‌గా వున్నాయి. ఇటీవలే ఓ మాంటేజ్ కోసం ఆయనిచ్చిన ట్యూన్ విన్న ప్రతిఒక్కరికి అమితం గా నచ్చటం సెట్ లోకూడా గ్యాప్ లో ఆ సాంగ్ నే వింటున్నారు. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలి అంతా చక్కగా వినే ఆడియో అవుతుంది. ఈ ఆడియో తో రికార్డు స్థాయిలో డౌన్ లోడ్స్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే రీ-రికార్డింగ్ లో స్పెషలిస్ట్ గా గోపిసుందర్ కి స్పెషల్ క్రేజ్ వుంది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది
ఈ చిత్రంలో హీరో నాని కి ఫాదర్ గా నరేష్ గారు నటించారు. ఎన్నో పాత్రల్లో నటించిన నరేష్ ఈ చిత్రంలో ప్రత్యేకంగా కనిపిస్తారు. నాని, నరేష్ ల మద్య వచ్చే సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అలాగే ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లొ నటించిన సితార, స్వప్నమాధురి లు అందరిని ఆకట్టుకునే పాత్రల్లో నటించారు. ఫ్యామిలి అంతా కలిసి వుండే సన్నివేశాలు చక్కటి వినోదాన్ని అందిస్తాయి. ఈ చిత్రం చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ.. మారుతి చెప్పిన కథ చాలా ఎంటర్‌టైనింగ్ గా వుంది. మారుతి గతంలో చేసిన చిత్రాలకంటే ఈ చిత్రం ఫుల్ అవుటండ్ అవుట్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా వుంటుంది. చెప్పింది చెప్పినట్లే తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని ఎస్ ప్రోడ్యుసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో, GA2 (A Division of GeethaArts) & UV Creations Prod No 1గా ఏక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాము. నాని, లావణ్య త్రిపాఠి లు హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. వీరిద్దరి క్యారెక్టర్లు చాలా ఢిఫరెంట్ గా వుంటాయి. మురళి శర్మ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, భద్రం పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి. 90% టాకీ కంప్లీటయ్యింది. ప్రస్తుతం రామెజిఫిల్మ్‌సిటి లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. జూన్‌లో షూటింగ్ కార్యక్రమాలు కంప్లీట్ చేసి జులై లో పోస్ట్ ప్రోడక్షన్ తో పాటు అన్ని కార్యక్రమాలు చేసుకుని, అగష్టు లో చిత్రాన్ని విడుదల చేస్తాము.ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.అని అన్నారు.