నా ముద్దురుచి ఎలా ఉంటుందో ఆయన్ను అడగండి!
on Oct 8, 2020
నందితా శ్వేతా గుర్తుందా? నిఖిల్ హీరోగా నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. తర్వాత నితిన్ 'శ్రీనివాస కళ్యాణం', 'బ్లఫ్ మాస్టర్' తదితర చిత్రాల్లో నటించింది. ఆమెను 'మీ పెదవుల రుచి ఎలా ఉంటుంది?' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెటిజన్ అడిగాడు. అంటే... మీకు లిప్ కిస్ పెడితే టేస్ట్ ఎలా ఉంటుందని అడిగాడు. నందితా శ్వేతా మంచి సమాధానం చెప్పారు. "భవిష్యత్తులో నాకు కాబోయే భర్తను ఆ విషయం అడగాలి" అని రిప్లై ఇచ్చారు. మరి, 'పెళ్లి ఎప్పుడు?' అంటే తెలియదని నందితా శ్వేతా చెప్పారు. మా ఇంట్లో సహా ప్రతి ఒక్కరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారని తెలిపారు. అదీ సంగతి.
సుజీత్ అనే నెటిజన్ నందితా శ్వేతాను 'మేకప్ పిశాచి' అని కామెంట్ చేశాడు. అతడికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. "అవును... పిశాచి! నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే నన్ను ఫాలో అవ్వడం మానేయ్. ఇది నా ప్రొఫైల్. నా మేకప్ నా ఇష్టం" అని గట్టిగా క్లాస్ పీకారు. లాక్డౌన్లో ఫిట్నెస్ మీద బాగా కాన్సంట్రేషన్ చేశానని, ఫిట్‌గా అయ్యానని నందితా శ్వేతా అన్నారు.
Also Read