నమిత కోసం మూడు అంబులెన్సులు
on May 28, 2014
.jpg)
సినీ నటి నమిత ఒక ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి కారణం ఏ వాహనమో కాదు, అభిమానుల ఉత్సాహం. తమిళనాడు, నామక్కల్ సమీపంలో గల భగవతి ఆలయంలో జరుగుతున్న ఉత్సావాలలో పాల్గొనడానికి చెన్నై నుంచి అక్కడకు వెళ్లిన నమిత చిన్నపాటి ప్రమాదం పాలయ్యారు. ఉత్సవాలలో భాగంగా అక్కడ సోమవారం రాత్రి నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదర్శనకు తమిళ చిత్ర నటుడు, దర్శకుడూ కె.భాగ్యరాజ్ ముఖ్య అతిథిగా వచ్చారు. రాత్రి తొమ్మిది తర్వాత నాటకం ప్రారంభించేందుకు నమిత స్టేజ్ మీదకు వెళ్లారు. బొద్దుగుమ్మ నమితను చూసిన జనం ఒక్కసారిగా స్టేజ్ వద్దకు తోసుకుని రావడంతో, స్టేజ్ ఒక పక్కకు విరిగింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఆమెను సురక్షితమైన చోటుకి తరలించారు.
ఒక్క ప్రమాదం జరిగితే ఎప్పటికో గాని చేరుకోని అంబులెన్సులు, నమిత గాయపడిందనే వార్త తెలియగానే మూడు అంబులెన్సలు ఆలయం దగ్గరకు పోటాపోటీగా చేరుకున్నాయి. తనకేమి జరగలేదని చెప్పి నమిత వాటిని పంపిచాల్సి వచ్చింది. తర్వాత నిర్వాహకులు మరో స్టేజి ఏర్పాటు చేసి, నాటకాన్ని ప్రారంభించాల్సిందిగా కోరారు. కాని ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో భాగ్యరాజ్ నాటకాన్ని ప్రారంభించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



