రాగాల "కోటి"కి పుట్టినరోజు
on May 28, 2014
amily: arial,sans-serif; font-size: 13px; font-style: normal; font-variant: normal; font-weight: normal; letter-spacing: normal; line-height: normal; text-align: center; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: rgb(255, 255, 255);">
ఏ చెట్టుకి ఆ కాయలే కాస్తాయి.
సంగీత కుటుంబంలో పుట్టినందుకేమో
ఆయన మీటితే రాగాలు అలా హాయిగా పులుకుతాయి.
దాదాపు అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేశారు
24 చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు.
తెలుగు సినీ సంగీత దర్శకులుగా కోటి రాగాలు పూయించిన కోటి గారి జన్మదినం సందర్భంగా....
ఆయన పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు. సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. తోటకూర సోమరాజుతో కలిసి రాజ్-కోటి గా ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. ప్రయాణంలో మలుపులు సహజం. కానీ 80-90 దశకాల్లో తెలుగు సినిమా మలుపులో ప్రయాణం సాగిస్తున్న సమయంలో చక్కటి సంగీతాన్ని అందించిన తెలుగు సినీ సంగీత దర్శకులు వీరు. అలా వీరి సంగీత దర్శకత్వంలో వచ్చిన యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్ ఎన్నో ఎన్నెన్నో...
ఆ తర్వాత కాలంలో రాజ్, కోటి కలిసి పనిచేయలేకపోయినా కోటీ ఎన్నో చక్కటి చిత్రాలకు నేటికీ సంగీతాన్ని అందిస్తున్నారు. అందులో అరుంధతి, చిరంజీవి తో హిట్లర్, బాలక్రిష్ణ తో పెద్దన్నయ్య, నువ్వు నాకు నచ్చావ్, నువ్వేకావాలి, మళ్లీశ్వరి, బెండు అప్పారావు వంటి అనేక చిత్రాలున్నాయి.
ఎప్పుడు మెలడీ సాంగ్ కంపోజ్ చేసినా తన తండ్రి పక్కనే ఉన్నారనే భావన కలుగుతుందని చెప్పే ఆయన ప్రియరాగాలే, కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు, ఒక్క సారి చెప్పలేవా, జేజమ్మా జేజమ్మా.. వంటి ఎన్నో ఆల్ టైం మెమరబుల్ సాంగ్స్‌ని అందించారు.
హైస్కుల్లో చదువుకునే రోజుల్లోనే గిటారిస్టుగా సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 8 ఏళ్లు పనిచేశారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్డీబర్మన్, బప్పీలహరి, జంధ్యాల వద్ద పనిచేసి ఎంతో అనుభవాన్ని సంపాదిచుకున్నారు. త్రిమూర్తి అనే మూవీకి ఆస్కార్ గ్రహీత రెహ్మాన్‌తో కలసి పనిచేశారు . సుభాష్‌ఘాయ్, డేవిడ్ ధావన్ వంటి బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాతలతో కలసి పనిచేశారు.
ప్రస్తుతం టీవీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తు ఎంతో మంది ఔత్సాహిక సంగీత కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు. సంగీతం మీద ఆసక్తి, కొంత బేసిక్ సంగీత జ్ఞానం ఉంటే, సినీ సంగీతంలో అడుగు పెట్టవచ్చు అని, శాస్త్రీయ సంగీతాన్ని అవపోసన పట్టాల్సిన పని లేదని నమ్మే ఆయన అందుకు తానే ఉదహరణ అంటారు.
ఎంతో అనుభవం తో పాటు అందరూ బాగుండాలనే కొండంత మనసున్న మనిషి కోటి. కోటి రాగాలను కలకాలం మనకు అందిస్తు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటోంది తెలుగువన్.