ఎన్టీఆర్.. ఎందుకీ పంతం??
on Nov 23, 2015
ఈ సంక్రాంతి బరిలో ఎలాగైనా నిలవాల్సిందే అనుకొంటున్నాడు ఎన్టీఆర్. సంక్రాంతి కోసం సినిమా సిద్ధం చేసుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే.. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ సంక్రాంతి తిరుగులేని సీజన్. సినిమా హిట్టు కొడితే.. కోట్లు కొల్లగొట్టొచ్చు. అందుకే సంక్రాంతి బరిలో సినిమాని నిలపడానికి ట్రై చేస్తుంటారు. కానీ.. అందుకు సరైన ప్రణాళిక కూడా ఉండాలి. నాన్నకు ప్రేమతో విషయంలో మాత్రం ఎన్టీఆర్‌కి అలాంటి ప్రణాళికలేం లేవు. కేవలం బాబాయ్ బాలకృష్ణకి పోటీగా తన సినిమాని సిద్ధం చేయాలనుకొంటున్నాడంతే.
ఎందుకంటే... నాన్నకు ప్రేమతో ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. స్పెయిన్‌లో ఓ షెడ్యూల్ తెరకెక్కించాలి. కానీ అందుకు అనుమతులు మాత్రం ఇంకా రాలేదు. స్పెయిన్ వెళ్లి, షూటింగ్ చేసుకొని తిరిగొచ్చే సరికి.. పొంగల్ వెళ్లిపోతుంది. అందుకే ఎన్టీఆర్ ఓ ప్లాన్ వేశాడు. స్పెయిన్లో తీయాల్సిన సీన్స్ ని ఇండియాలోనే షూట్ చేసేయండి అంటున్నాడట. అక్కడ ఇది వరకు తీసిన సీన్లకు మ్యాచింగ్ కావాలంటే.. సెట్లు వేయండి అంటూ ఆర్డరేశాడట. దాంతో.. చిత్రబృందం ఉరుకులు పరుగుల మీద.. స్పెయిన్‌కి మ్యాచింగ్ సీన్లు హైదరాబాద్లోనే తీయడానికి ప్రత్యామ్నాయాలను వెదుక్కొంటోంది.
సినిమాని తొందరగా చుట్టేయాలన్న కుతూహలంతో సీన్లపై దృష్టి పెట్టడం లేదన్నది లేటెస్ట్ టాక్. ఇలాగైతే సంక్రాంతికి సినిమాని తీసుకొచ్చేయొచ్చు గాక.. కానీ డిక్టేటర్‌కి దీటుగా నిలబడతాడా? అనే సందేహం నెలకొంది. పంతంతో ఈ సినిమాని కావాలని కిల్ చేసుకొంటున్నాడేమో అనిపిస్తోంది. ప్చ్.. ఇలాగైతే నాన్నకు ప్రేమతో సినిమా ఏమైపోతుందో??