దేవిశ్రీని ఛాలెంజ్ చేసిన పవన్!
on Nov 22, 2015
పవన్ కల్యాణ్ గొప్ప డాన్సరేం కాదు. తన లోని స్పీడ్ కంటే, ఈజ్‌కీ, స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ అతని స్టెప్పులు సాగిపోతుంటాయి. అవి అభిమానులకు నచ్చుతాయి కూడా. అయితే ఇప్పుడు సర్దార్ - గబ్బర్ సింగ్‌లో పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడట. దీనంతటికీ కారణం.. దేవిశ్రీ అందించిన ట్యూనే! సర్దార్ గబ్బర్ సింగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ అందించాడట. ఆ పాట విని.. పవన్ లో హుషారొచ్చేసిందట. వెంటనే.. దేవిశ్రీని పిలిచి.. నువ్వు హుషారైన పాటిచ్చావు, అంతకంటే హుషారుగా స్టెప్పులేసి చూపిస్తా - కావాలంటే ఛాలెంచ్ అంటూ సవాల్ విసిరాడట. దాంతో దేవిశ్రీ కూడా తెగ ఖుషీ అయిపోతున్నాడట. అంతేకాదు, ఈ పాటని స్వయంగా పవన్ కల్యాణే ఆలపిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ నుంచి పవన్ కాస్త స్టెప్పులపై దృష్టి పెట్టాడు. అత్తారింటికి దారేదిలోనూ మంచి స్టెప్పులే వేశాడు. ఈసారి మాత్రం సర్దార్‌తో కేక పుట్టించబోతున్నాడట. పవన్ అభిమానులకు అంతకంటే కావల్సింది ఏముంది??