ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా?
on Jun 29, 2015
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏది కలిసిరాని హీరో ఎవరంటే ఎన్టీఆరేనని చెప్పాలి. ఎందుకంటే అగ్ర హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ కి గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకోదగిన హిట్ లేకపోవడమే. దాని కోసం అతను ఎంత కృషి చేసిన కాలం కలిసిరావడం లేదు. ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమవుతున్న శ్రీమంతుడు సినిమా స్టొరీని కొరటాల ముందు చెప్పింది ఎన్టీఆర్ కేనట.
అప్పుడు ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు కూడా. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోయింది. ఆ తరువాత కొరటాల శివ ఈ సినిమాని మహేష్ కి చెప్పడం వెంటనే సెట్స్ పైకి వెళ్ళడం చకచక జరిగిపోయాయి. ఆగస్ట్ 7న రిలీజ్ కాబోతున్న 'శ్రీమంతుడు' టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పాత విషయం పక్కన పెడితే మళ్ళీ ఈ కాంబినేషన్ పట్టాలెక్కబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఎన్టీఆర్ కోసం కొరటాల ఓ స్టోరీ సిద్ధం చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం శ్రీమంతుడు షూటింగ్ పూర్తి కావచ్చింది... అయితే సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. సో.. సుకుమార్ సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా 2016లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుందని సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
