NBK111: అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా?.. డైరెక్టర్ మారిపోయాడా?
on Jan 23, 2026

NBK111 మూవీ డైరెక్టర్ ఎవరు?
గోపీచంద్ మలినేనికి బాలయ్య ఓకే చెప్పాడా?
అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సంగతేంటి?
'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ (Nanadamuri Balakrishna), దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మరోసారి చేతులు కలిపారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో ఇటీవల సస్పెన్స్ నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ కి తెరపడింది.
'NBK 111'ను మొదట హిస్టారికల్ ఫిల్మ్ గా చేయాలనుకున్నారు. కానీ, ఆ తర్వాత జానర్ ఛేంజ్ చేసి.. మరో కొత్త కథపై వర్క్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపించింది. అదే సమయంలో మరో న్యూస్ తెరపైకి వచ్చింది.

2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒక కథ సిద్ధం చేశాడని.. గోపీచంద్ సినిమా ఆలస్యమవుతుండటంతో అనిల్ తో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పాడని ప్రచారం జరిగింది. దీంతో 'NBK 111' ప్రాజెక్ట్ రావిపూడి చేతికి వెళ్ళి, 'NBK 112' మలినేని చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే 'NBK 111' డైరెక్టర్ ఎవరనే సస్పెన్స్ తాజాగా వీడిపోయింది. ముందుగా ప్రకటించినట్టుగానే బాలకృష్ణ-మలినేని కాంబోలో సినిమా ఉంటుందని తాజాగా టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిందని, నరేషన్ పూర్తయిందని తెలిపింది. అంతేకాదు వేసవిలో షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



