Space Gen: Chandrayaan Review: స్పేస్ జెన్ చంద్రయాన్ వెబ్ సిరీస్ రివ్యూ
on Jan 23, 2026
.webp)
వెబ్ సిరీస్ : స్పేస్ జెన్: చంద్రయాన్
నటీనటులు: శ్రియా సరన్, గోపాల్ దత్, నఖుల్ మెహతా, ప్రకాశ్ బెలావాడి, దనిశ్ సైత్ తదితరులు
మ్యూజిక్: రోహణ్
సినిమాటోగ్రఫీ: శ్రీ నమ్జోషి
దర్శకత్వం: అనంత్ సింగ్
నిర్మాతలు: విజయ్ కోషి
ఓటిటి: జియో హాట్ స్టార్
కథ:
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ లో అర్జున్(నఖుల్ మెహతా) ఒక ప్రోగ్రామర్ గా ఉన్నాడు. అయితే ఆ మిషన్ కు కోఆర్టినేటర్ యామిని(శ్రియా సరన్). అర్జున్ వాళ్ళ నాన్న ఇండియన్ మిలటరీలో ప్రాణాలర్పిస్తాడు. అతని కోరిక మేరకే అర్జున్ ఇస్రో లో ప్రోగ్రామింగ్ యూనిట్ లో ప్రోగ్రామర్ గా జాబ్ తెచ్చుకుంటాడు. అయితే అతనికి పని ఒత్తిడి పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అదే సమయంలో ఇస్రో ఛీఫ్ గా రామయ్య నియమించబడతాడు. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ రాకెట్ కక్ష్యలోకి వెళ్ళాక మిస్ అవుతుంది. దాంతో ఆ ప్రయోగం ఫెయిల్ అయిందని దేశమంతటి నుండి ఇస్రోకి తీవ్ర విమర్శలు వస్తాయి. అయితే అది ఫెయిల్ అవ్వడానికి కారణం అర్జున్ అని అతడిని తర్వాతి ప్రాజెక్టులో నుండి తీసేస్తాడు ఛీఫ్ రామయ్య. ఆ తర్వాత శ్రీహరికోటలో చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతుంది. మరి అర్జున్ తన నాన్నకి ఇచ్చిన మాటని నిలుపుకున్నాడా? చంద్రయాన్-3 లో అర్జున్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సిరీస్ మొత్తంగా అయిదు ఎపిసోడ్ లతో సాగింది. మొదటి ఎపిసోడ్- ఫైండింగ్ విక్రమ్(Finding Vikram) లో మిషన్ చంద్రయాన్-2 ఫెయిల్యూర్ అవుతుంది. ఇక రెండో ఎపిసోడ్-మ్యాన్ వర్సెస్ మిషన్(Man vs Machine) లో మిషన్ విఫలమవ్వడం.. దానికి గల కారణాలు వెతకడం.. అన్ని పాజిబులిటీస్ తో విక్రమ్ ని కనిపెట్టడం సాగుతుంది. మూడో ఎపిసోడ్- సైన్స్ ఫైండ్ ఏ వే(Science Find A way)లో మిషన్ కోఆర్డినేటర్ యామినికి, ఛీఫ్ రామయ్యకి మధ్య ఛాలెంజ్ ఉంటుంది. నాలుగో ఎపిసోడ్- మేక్ ఇన్ ఇండియా(Make in India)లో కోవిడ్-19 లో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలు వాటిని దాటి మిషన్ కోసం పనిచేసే ఎఫర్ట్స్, అలాగే దేశంలోనే తయారు చేసే కంపెనీల వెంట ఇస్రో చైర్మన్ తిరగడం.. ఇలా మిషన్ కోసం వాళ్లు పడిన సమస్యలను చూపించారు. ఇక చివరి ఎపిసోడ్- వేర్ ది మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్(Where the Mind is without Fear).. ఇందులో మిషన్ ఎగ్జిక్యూట్ చేయడంలో శాస్త్రవేత్తలు ఎవరెవరు.. ఎంతగా సహాయపడ్డారో చూపించాడు దర్శకుడు. రామయ్య సేవలని, అర్జున్ ప్రోగ్రామింగ్ స్కిల్ ని, మేనేజింగ్ డైరెక్టర్ గా యామిని తమవంతు కృషిని చూపించారు.
ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇస్రోకి తగినంత డబ్బుని గవర్నమెంట్ ఇవ్వకపోవడంతో నాసిరకం స్పేర్ పార్ట్స్ తో పిఎస్‌ఎల్‌విని అంతరిక్షంలోకి పంపడం.. అది విఫలం అవ్వడం.. దానిని అన్ని మీడియా ఛానెల్స్ విమర్శించడం అంతా ఇంటెన్స్ గా సాగుతుంది. అయితే ఆ స్పేర్ పార్ట్స్ కంపెనీ ఎండీ బహిరంగంగా మీడియాలో మా తప్పేం లేదని చెప్పడంతో దానిని ఇస్రో చైర్మన్ ధీటుగా ఎదుర్కోవడం హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత రతన్ టాటానే స్వయంగా రాకెట్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారు చేస్తానని చెప్పే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దేశంతో రతన్ టాటాకి ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించాడు.
దేశం కోసం నాన్న చేసిన త్యాగాన్ని అర్జున్ ని వెంబడిస్తుంది. ప్రెషర్ ను తట్టుకోలేక అర్జున్ రిజైన్ చేయడమనేది ఓ పెద్ద మలుపు. ఆ క్రమంలో అర్జున్ పడిన మానసిక సంఘర్షణను మూడో ఎపిసోడ్, నాలుగో ఎపిసోడ్ లలో చక్కగా చూపించారు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి భావోద్వేగాల్ని పంచుతాయి. మొదటి ఎపిసోడ్ నుండి చూసిన ప్రతీ ఒక్కరికి ఈ సిరీస్ నచ్చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ప్రోగ్రామర్ అర్జున్ గా నఖుల్ మెహతా, మిషన్ కోర్డినేటర్ యామినిగా శ్రియా సరన్, ఇస్రో ఛీఫ్ రామయ్యగా ప్రకాశ్ బెలావాడి, ఇస్రో చైర్మెన్ గా దనిశ్ సైత్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ ఇది.
రేటింగ్: 3/5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



