బాలకృష్ణ కోసం భారీ గుడి
on May 20, 2024
నందమూరి నటసింహం బాలకృష్ణ (balakrishna) కి టెంపుల్ కి ఏదో అవినావ సంబంధం ఉంది. ఆయన సినీ కెరీర్ ని ఒకసారి గమనిస్తే చాలా చిత్రాల్లోని ముఖ్యమైన సన్నివేశాలు టెంపుల్ లోనే తెరకెక్కాయి.బహుశా ఆయనకి ఉన్న ఆధ్యాత్మక భావాలు వలన దర్శక రచయితలు ఆ దిశగా ఆలోచిస్తున్నారేమో. పైగా ఆ సీన్స్ అభిమానులకి గాని ప్రేక్షకులకి గాని థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తాయి. సింహ, లెజండ్, అఖండ వంటి సినిమాలే అందుకు ఉదాహరణ
చిరంజీవి(chiranjeevi)హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య తో భారీ హిట్ ని అందుకున్న బాబీ(bobby) దర్శకత్వంలో బాలయ్య కొత్త మూవీ తెరకెక్కుతున్న విషయం అందరకి తెలిసిందే. రెండు నెలల క్రితం విడుదలైన గ్లింప్స్ తో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సరికొత్త బాలయ్య ని చూడబోతున్నామనే విషయం కూడా అందరకి అర్ధమయ్యింది. ప్రెజంట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ షెడ్యూల్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇందుకోసం ప్రత్యేకంగా ఒక భారీ టెంపుల్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కానున్నాయని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలతో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గత చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు
వరుస విజయాలతో జోరు మీద ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (sitara entertainments)బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి ని పార్టీ అడిగిన ఊర్వశి రౌటేలా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. విలన్ గా యానిమల్ బాబీ డియోల్ చేస్తున్నాడు. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కూడా బాలయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో ఇది 109 వ చిత్రం
Also Read