వరుణ్ తేజ 'ముకుంద' ఆడియో డేట్
on Oct 9, 2014
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు 'వరుణ్ తేజ' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద'గా టాలీవుడ్ కి పరిచయంకాబోతున్నాడు. తాజా సమాచార౦ ప్రకారం ఈ సినిమా ఆడియోను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. మూడు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందట. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుతున్నాయి. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
