అఖిల్‌ది ఏ కంపెనీ ఫోన్?
on Dec 14, 2018

'హీరోయిన్ నిధి అగర్వాల్ చేతిలో ఆపిల్ కంపెనీ మోడల్ 'ఐ' ఫోన్ వుంది. అఖిల్ అక్కినేని చేతిలో ఫోన్ ఏ కంపెనీదో తెలియడం లేదే? ఇంతకీ... అఖిల్‌ది ఏ కంపెనీ ఫోన్ అయ్యి వుంటుంది?' రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే డిస్కషన్! దీనికి కారణం ఒక్కటే... వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న 'మిస్టర్ మజ్ను'లో 'ఏమైనదో' పాటను ఈ రోజు (శుక్రవారం) ఉదయం విడుదల చేస్తున్నట్టు ముందుగా ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో హీరో హీరోయిన్లు అఖిల్, నిధి అగర్వాల్ ఫోనులు పట్టుకుని కూర్చున్నారు. నిధి ఫోన్ మీద యాపిల్ కంపెనీ లోగో కనిపిస్తుంది. అఖిల్ ఫోన్ మీద లోగో కనిపించడం లేదు. ప్రేక్షకులు ఈ విషయం గమనించి డిస్కషన్ మొదలు పెట్టారు. అదండీ సంగతి. ఇంతకీ, అఖిల్ ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారో? ఈ టాపిక్ పక్కన పెడితే... ఈ రోజు విడుదలైన 'ఏమైనదో' పాట ప్రేక్షకులను ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరి తొలి సినిమా 'తొలిప్రేమ'కు మాంచి మెలోడీలు అందించిన తమన్... మలి సినిమా 'మిస్టర్ మజ్ను'కు మరోసారి అందమైన మెలోడీ అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



