`మిఠాయి` మూవీ రివ్యూ!!
on Feb 22, 2019

నటీనటులుః రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి,కమల్ కామరాజు ఇంకా తదితరులు
సాంకేతిక నిపుణులుః
డైరక్టర్ః ప్రశాంత్ కుమార్
నిర్మాతలుః ప్రభాత్ కుమార్
సంగీతం: వివేక్ సాగర్
విడుదల తేదిః 22-2-2019
ఇటీవల కాలంలో తమదైన శైలి లో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ . వీరిద్దరు హీరోలుగా నటించిన డార్క్ కామెడీ సినిమా `మిఠాయి`. డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందో తెలుసుకుందాం...
స్టోరిలోకి వెళితే...
చిన్నానాటి దోస్తులైన సాయి (రాహుల్) జానీ (ప్రియదర్శి) పని పాట ఏమీ చేయకుండా తిని తిరిగుతుంటారు. ఇలాంటి క్రమంలో పెళ్లి చేసుకోవాలని సాయి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబోయే పెళ్లాం కోస సాయి ఒక గోల్డ్ చెయిన్ కొంటాడు . దాన్ని కాస్త ఎవరో దొంగిలిస్తారు. దాన్ని అవమానంగా భావించిన ఆ దొంగ దొరికే వరకు పెళ్లే చేసుకోనని శపథం చేస్తాడు. మరి చివరకు ఆ దొంగను పట్టుకున్నాడా? దీనికి తన మిత్రుడు జానీ ఎలాంటి సాయం చేసాడన్న సినిమా కథాంశం.
నటీనటల హావభావాలు:
ప్రధాన పాత్రలైన రాహుల్, ప్రియదర్శి సినిమాకు చెరొక భుజమై తమ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసారు. చాలా రియలిస్టిక్ గా ఇద్దరూ చేసారు. కమల్ కామరాజు ట్రాక్ కూడా పర్వాలేదనిపిస్తుంది. మిగతా వారు కూడా తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
డైరక్టర్ రాసుకున్న కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించేలా ఉన్నాయి. కానీ, కథ ,కథనాలు ఆకట్టుకునే విధంగా లేవు. సినిమా ఇంట్రస్టింగ్ గానే మొదలైనా అనవసరమైన పాటలు, సీన్స్ సినిమాను ట్రాక్ తప్పేలా చేసాయి. రిపీట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో బోర్ ఫీల్ కలుగుతుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
విశ్లేషణ:
సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైనప్పటికీ అది చివరి వరకు ఉండకపోవడంతో సినిమా స్వీట్ కాస్త హాట్ గా మారింది. రాహుల్ , ప్రియదర్శి పేలవమైన సన్నివేశాలను కూడా వారి నటనా ప్రతిభతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో రిపీట్ సీన్స్ , సెకండాఫ్ బాగా స్లోగా ఉండటంతో బోర్ ఫీల్ వస్తుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఫర్వాలేదు. ఇంకొంచెం కత్తెరకు పని చేప్పుంటే బావుండేది అనిపించింది. రాహుల్, ప్రియదర్శి కామెడీతో పాటు డార్క్ కామెడీ నచ్చే వారికి కొన్ని కొన్ని సన్నివేశాలు నచ్చొచ్చు. మిగతా వారికి మాత్రం నిరాశ తప్పదు.
రేటింగ్: 2.25
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



