శ్రీ హరి తనయుడు హీరోగా ఎంట్రీ!!
on May 22, 2019
రౌడీ గా , కామెడీ విలన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రల విలక్షణ నటుడు శ్రీ హరి హీరోగా ఎదిగారు. శ్రీ హరి నటించిన అనేక చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు శ్రీ హరి తనయుడు మేఘాంశ్ శ్రీ హరి హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. హీరో శ్రీహరి , నటి , డాన్సర్ డిస్కో శాంతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి ఇద్దరు కుమారులు మేఘాంశ్ శ్రీహరి , శశాంక్ శ్రీహరి. సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరి మృతి చెందడంతో డిస్కో శాంతి తమ కుమారులను పెంచి పెద్ద చేశారు. కార్తీక్ - అర్జున్ నూతన దర్శకుల ద్వయం దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి హీరోగా రాజ్ దూత్ మూవీ రూపొందనుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న రాజ్ దూత్ మూవీ లో బైక్ కు ప్రాధాన్యం ఉందని సమాచారం.రాజ్ దూత్ మూవీ తో మేఘాంశ్ హీరో గా టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం.
Also Read