కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే
on Dec 30, 2025

-పేరు ఏంటో తెలుసా!
-ఖచ్చితంగా ఆ నటుడే
-ఫస్ట్ సినిమా ఎవరితో
'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.
బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ఎన్టీఆర్(Ntr)రామ్ చరణ్(Ram Charan),అల్లు అర్జున్(Allu Arjun),రవితేజ(Raviteja) వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ 2015 లో వచ్చిన టెంపర్ తర్వాత ఏ మూవీని నిర్మించలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా BG బ్లాక్ బస్టర్స్(BG Blockbustersఅనే సరికొత్త బ్యానర్ ని ఏర్పాటు చేసాడు. ఈ మేరకు అధికారకంగా ప్రకటిస్తు లోగోని విడుదల చేసాడు. ఈ బ్యానర్ ద్వారా హృదయాలను తాకే కథలు, ఎమోషనల్ స్టోరీలు, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తూ సినిమాలు నిర్మిస్తానని ఎక్స్ వేదికగా తెలిపాడు. BG అంటే Bandla ganesh అనే అర్ధం తెలిసిందే.
Also read: జననయగాన్ రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు
కొంత కాలం నుంచి చాలా ఇంటర్వూస్ లో బండ్ల గణేష్ మాట్లాడుతు మళ్ళీ సినిమాలు నిర్మించి తన సత్తా చాటుతానని చెప్తూ వస్తున్నాడు. దీంతో చెప్పిన మాట ప్రకారం సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. కాకపోతే బ్యానర్ పేరు మార్చడం చర్చినీయాంశ మయ్యింది. ఏది ఏమైనా అభిమానులతో పాటు ప్రేక్షకులు గణేష్ రీ ఎంట్రీ కి సోషల్ మీడియా వేదికగా వెల్ కమ్ చెప్తున్నారు. మరి ఫస్ట్ మూవీ ఎవరితో ఉంటుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



