చిరంజీవి సినిమా ఆలస్యానికి జన నాయగన్ అడ్డంకి గా మారిందా!
on Jan 23, 2026

-చిరంజీవికి, విజయ్ జననాయగన్ కి సంబంధం ఏంటి!
-అడ్డంకి వార్తలు నిజమేనా!
-ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది.
-పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..ఇళయ దలపతి విజయ్(Vijay)..సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరి కట్ అవుట్స్ కి ఉన్న చరిష్మా ఏ పాటిదో తెలిసిందే. ఓన్ లాంగ్వేజ్ లో అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వర్షంతో తడిసి ముద్దవ్వాల్సిందే. చిరంజీవి ప్రెజెంట్ మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫ్యాన్స్ ఆనందం గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. కానీ విజయ్ తో పాటు ఫ్యాన్స్ మాత్రం జననాయగన్(Jananayagan)రిలీజ్ కి అడ్డంకులు ఎదురుకావడంతో డీలా లో ఉన్నారు. మరి ఇప్పుడు ఇదే జన నాయగన్ చిరంజీవి ప్రాజెక్ట్ కి అడ్డంకిగా మారినట్టు సౌత్ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. మరి పూర్తి విషయమేంటో చూద్దాం.
మన శంకర వరప్రసాద్ తర్వాత బాబీ(Bobby)దర్శకత్వంలో చిరంజీవి తన నెక్స్ట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అధికారకంగా ప్రారంభమవ్వడమే కాకుండా, ఇప్పటికే వచ్చిన పోస్టర్ తో మూవీపై అంచనాలు పెరిగాయి.సదరు పోస్టర్ ద్వారా చిరంజీవి ని సరికొత్త కోణంలో బాబీ చూపించబోతున్నాడని, కథ, కథనాలు ఎవరి ఊహలకి అందని విధంగా ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. దీంతో సదరు మూవీ త్వరగా షూటింగ్ కి వెళ్లి మళ్ళీ బాస్ సంక్రాంతికి రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ షూటింగ్ మరింత లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సదరు చిత్రాన్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్(Kvn Productions).ఈ సంస్థనే జన నాయగన్ ని నిర్మించింది.
Also read: 2026 ఆస్కార్ అందుకోబోయే చిత్రాలు ఇవే.. జాన్వీ కపూర్ జాక్ పాట్ కొట్టింది
ఇప్పుడు ఈ సంస్థకి జననాయగన్ విషయంలో ఆర్థిక, న్యాయపరమైన సమస్యలు చుట్టుముట్టాయన్నది కోలీవడ్ టాక్. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్‌సీతో నడుస్తున్న న్యాయపోరాటం ప్రొడక్షన్ ని ఇబ్బందుల్లోకి నెట్టినట్టు సౌత్ సినీ ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో కేసు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు చిరంజీవి చిత్రాన్ని ప్రారంభించడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంపై సినీ విశ్లేషకులు సైతం స్పందిస్తు నిర్మాతల ముందు రెండు మార్గాలున్నాయి. అన్ని సమస్యలు తీరే వరకు వేచి చూడడం. లేదా లైన్ ప్రొడ్యూసర్‌ని తీసుకుని సహనిర్మాణం ద్వారా షూటింగ్‌ని స్టార్ట్ చేయడమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మరి కె వి ఎన్ ప్రొడక్షన్స్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఫ్యాన్స్ అయితే మాత్రం త్వరగా షూటింగ్ కి వెళ్లాలనుకుంటున్నారు. చిరంజీవి చేస్తున్న 158 వ చిత్రం.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



