'పొన్నియన్ సెల్వన్'లో మెగాస్టార్ చిరంజీవి!
on Aug 20, 2022
కోలీవుడ్ బాహుబలిగా చెబుతున్న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్-1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష వంటి ఎందరో స్టార్స్ కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
'పొన్నియన్ సెల్వన్-1' నుంచి 'చోళ చోళ' అంటూ సాగే సాంగ్ ని శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. ఇలాంటి భారీ కథలను రెండు భాగాలుగా ఎలా చెప్పాలో 'బాహుబలి' తీసి రాజమౌళి దారి చూపించారని అన్నారు. అలాగే చిరంజీవికి థాంక్స్ చెబుతున్నానని, ఎందుకనేది త్వరలోనే తెలుస్తుందని మణిరత్నం చెప్పారు.
చిరంజీవికి మణిరత్నం స్పెషల్ థాంక్స్ చెప్పడం చూస్తుంటే.. ఇందులో చిరంజీవి గెస్ట్ రోల్ ఏమైనా పోషించారా అన్న సందేహం కలుగుతోంది. అయితే ఇందులో చిరంజీవి స్పెషల్ రోల్ చేయలేదని, కేవలం వాయిస్ అందిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఒక ప్రధాన పాత్రకి తెలుగులో చిరంజీవి డబ్బింగ్ చెబుతున్నారని, అందుకే మణిరత్నం ఆయనకు థాంక్స్ చెప్పారని అంటున్నారు. మరి మణిరత్నం థాంక్స్ వెనకున్న కారణమేంటనేది త్వరలోనే తేలిపోనుంది.
Also Read